ETV Bharat / sitara

త్వరలో సినిమా షూటింగ్​కు​​ సల్మాన్​ఖాన్! - సల్మాన్​ 'రాధే

స్టార్​ హీరో సల్మాన్​ఖాన్.. త్వరలో​ 'రాధే' సెట్​లో అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు చిత్రబృందం అంతా సిద్ధం చేస్తోందని సమాచారం.

radhe
రాధే
author img

By

Published : Jul 7, 2020, 5:02 PM IST

కరోనాతో నిలిచిపోయిన చిత్రీకరణలు, ప్రభుత్వాలు ఇచ్చిన సడలింపుల్లో భాగంగా పునఃప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్​ స్టార్​ హీరో సల్మాన్​ ఖాన్ ​ నటిస్తోన్న 'రాధే' సినిమా.. ఆగస్టు నుంచి సెట్స్​పైకి వెళ్లనుందట​. ముంబయిలోని మెహబూబ్​ స్టూడియోలో ఓ ఫ్లోర్​ను ఇందుకోసం చిత్రబృందం బుక్ చేసుకుందని సమాచారం. అయితే పరిమిత సంఖ్యలో నటీనటులతో దీనికి హాజరు కానున్నారట.

ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా 'రాధే'కు దర్శకుడు. ఈ సినిమాలో దిశా పటానీ హీరోయిన్. జాకీ ష్రాఫ్​, రణ్​దీప్​ హుడా, భరత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అతుల్​ అగ్నిహోత్రి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానుంది.

ఇది చూడండి : క్యాన్సర్​తో పోరాడుతూ ప్రముఖ నిర్మాత మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.