ETV Bharat / sitara

ఈ సారి ఈద్​కు సల్మాన్​ఖాన్ సినిమా కష్టమే! - movie news

గత కొన్నేళ్ల నుంచి ప్రతి ఈద్​కు కొత్త సినిమాతో అభిమానులను పలకరిస్తున్నాడు బాలీవుడ్​ హీరో సల్మాన్​ఖాన్. ఈసారి మాత్రం మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. కరోనా తీవ్రత ఇంకా తగ్గకపోవడమే ఇందుకు ప్రధాన కారణం.

Salman Khan to miss Eid release this year?
సల్మాన్​ ఖాన్ 'రాధే' విడుదలపై కరోనా ప్రభావం
author img

By

Published : Apr 7, 2020, 3:28 PM IST

గత కొన్నేళ్ల నుంచి ప్రతి ఈద్​ పండక్కి, కొత్త సినిమాలతో అభిమానుల ముందుకొస్తున్నాడు స్టార్ హీరో సల్మాన్​ఖాన్. ఈ ఏడాది 'రాధే' చిత్రాన్ని తీసుకురావాలని అనుకున్నాడు. కానీ అనుకోని అవాంతరంలా కరోనా పంజా విసిరింది. దీంతో అన్ని ఇండస్ట్రీల షూటింగ్​లు, విడుదలలు వాయిదా పడ్డాయి. ఈ బాబితాలోకి ఇప్పుడు భాయ్​ సినిమా చేరింది. మే 22న విడుదల కావాల్సి ఉన్నా, ఇప్పుడు ఆ తేది మారే అవకాశమే ఎక్కువగా ఉంది.

radhe team
రాధే చిత్రబృందం

ఈద్​ నాటికి కష్టమే

'రాధే'ను మార్చి కల్లా పూర్తి చేయాలని చిత్ర బృందం భావించింది. ఆ నెల మధ్యలో కరోనా భారత్​లోకి ప్రవేశించడం, లాక్​డౌన్ విధించడం వల్ల పనులు సగంలో నిలిచిపోయాయి. ఒకవేళ పరిస్థితులు చక్కబడి, తిరిగి పనులు ప్రారంభించినా ఈద్ నాటికి చిత్రాన్ని పూర్తి చేయడం కష్టమనే తెలుస్తోంది.

కొరియన్​ యాక్షన్​ థ్రిల్లర్​ 'ద అవుట్​లాస్'కు రీమేక్​గా 'రాధే'ను రూపొందిస్తున్నారు. ఇందులో సల్మాన్​ ఓ పోలీస్ అధికారిగా సందడి చేయనున్నాడు. దిశా పటానీ హీరోయిన్. రణ్​దీప్​, జాకీ ష్రాఫ్​ కీలక పాత్రధారులు. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నాడు. సల్మాన్​​, సొహైల్​ ఖాన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇదీ చదవండి: కరోనా తీవ్రత తగ్గిన వెంటనే #ప్రభాస్20 అప్​డేట్స్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.