బాలీవుడ్ అగ్రహీరో సల్మాన్ ఖాన్.. 'అంతిమ్' సినిమా షూటింగ్‌ను ఇటీవల పూర్తి చేశారు. ఇప్పుడు 'టైగర్' ఫ్రాంచైజీలో మూడో భాగం కోసం సిద్ధమవుతున్నారు. దీని చిత్రీకరణ ఇస్తాంబుల్‌లో జరగనున్నట్లు తెలుస్తోంది.
తొలుత ఈ సినిమాలో కీలక సన్నివేశాల్ని యూఏఈలో తెరకెక్కించాలని అనుకున్నారు. కానీ అక్కడ కరోనా కేసుల దృష్ట్యా నిర్మాతల ఆలోచన మారినట్లు తెలుస్తోంది. బదులుగా టర్కీలోని ఇస్తాంబుల్‌లో షూటింగ్ చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం లోకేషన్ల వేటలో చిత్రబృందం ఉందని సమాచారం. వచ్చే నెల నుంచి సల్మాన్ సెట్లోకి రానున్నారు.
సల్మాన్ నటించిన 'రాధే'.. ఈ ఏడాది ఈద్ కానుకగా థియేటర్లలో విడుదల కానుంది. దిశా పటానీ హీరోయిన్గా చేయగా, ప్రభుదేవా దర్శకత్వం వహించారు.