ETV Bharat / sitara

లాక్​డౌన్​ వేళ ఫామ్​హౌస్​లో ప్రియురాలితో సల్మాన్​! - cinema news

ప్రియురాలు లులియా వంతూర్​తో​ కలిసి, తన ఫామ్​హౌస్​లో ఉన్నాడు బాలీవుడ్​ హీరో సల్మాన్​ఖాన్. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది.

Salman Khan spends with his lover luliya vantoor in his farm house in lockdown time
ఫామ్​హౌస్​లో ప్రియురాలితో సల్మాన్​ ఖాన్​!
author img

By

Published : Apr 19, 2020, 5:18 AM IST

కరోనా తీవ్రత పెరుగుతుండటం వల్ల‌ భారత్ ప్రస్తుతం​ లాక్‌డౌన్‌లో ఉంది. దీనివల్ల స్టార్​హీరో సల్మాన్‌ఖాన్..‌ కొన్నాళ్లుగా కుటుంబంతో కలిసి తన ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యాడు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఇటీవలే పోస్ట్ చేస్తూ అభిమానులతో టచ్​లో ఉన్నాడు. అయితే సల్మాన్‌ ప్రియురాలు లులియా వంతూర్‌.. అక్కడే ఉందని టాక్​. వీరిద్దరూ కలిసున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో కనిపిస్తుండటం వల్ల ఈ వార్తకు మరింత బలం చేకూరింది.

ఇందులో లులియా వంతూర్ వేరొకరితో వీడియో చాట్‌ చేస్తుండగా, అకస్మాత్తుగా వెనక నుంచి సల్మాన్‌ వస్తాడు. కొంచెం ఇబ్బంది పడిన లులియా.. అతడిని పక్కకు వెళ్లమని సైగ చేస్తుంది. దాంతో సల్మాన్‌ అక్కడి నుంచి తప్పుకుంటాడు. ఇంకా ఆ వ్యవసాయక్షేత్రంలో సల్మాన్​ సోదరి అర్పితాఖాన్‌, బావ ఆయుష్‌ శర్మ, తన సోదరుడి కుమారుడితో పాటు జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్, అల్విరా అగ్నిహోత్రాలు ఉన్నారని అనుకుంటున్నారు. సల్మాన్‌.. ప్రస్తుతం ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న 'రాధే' సినిమా చేస్తున్నాడు. దిశా పటానీ హీరోయిన్. ఈ ఏడాది ఈద్​కు రావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా అది కాస్త వాయిదా పడింది.

ఇదీ చూడండి : దర్శకధీరుడు రాజమౌళి తర్వాతి సినిమా మహేశ్​తో

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.