ETV Bharat / sitara

'15 ఏళ్ల నుంచే పనిచేయడం మొదలుపెట్టా' - hero salman khan latest news

తన కెరీర్​ గురించి మాట్లాడిన హీరో సల్మాన్​ఖాన్.. అపజయాలు ఎదురైనా, ఊహించిన విధంగా లేకున్నా పనిచేస్తూనే ఉన్నానని చెప్పారు. లాక్​డౌన్ ముగిసిన తర్వాత ముంబయిలో ఉంటున్న కుటుంబసభ్యుల దగ్గరికి వెళ్తానని అన్నారు.

'15 ఏళ్ల నుంచే పనిచేయడం మొదలుపెట్టా'
హీరో సల్మాన్​ఖాన్
author img

By

Published : May 10, 2020, 3:21 PM IST

తన సినిమాలు విజయం సాధించకపోయినప్పటికీ నటించడం మాత్రం ఆపలేదని బాలీవుడ్‌ స్టార్ హీరో సల్మాన్​ఖాన్‌ పేర్కొన్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రస్తుతం తన పాన్వెల్‌ ఫాంహౌస్‌లో ఉంటున్నారు. ఈ సందర్భంగా ఓ వెబ్‌సైట్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. లాక్‌డౌన్‌ కారణంగా తన కెరీర్‌లోనే షూటింగ్‌కు ఎక్కువ విరామం వచ్చిందని చెప్పారు.

hero salman khan
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ొ

'నా కుటుంబంతో కలిసి ఉండాలని ఉంది. కానీ మా అమ్మ సల్మా, సోదరి అర్పితా ఖాన్‌, ఆమె పిల్లలు ముంబయిలోని ఇంట్లో ఉంటున్నారు. లాక్‌డౌన్‌ తొలగించిన తర్వాత వారి దగ్గరికి వెళ్తా. లాక్‌డౌన్‌ సమయంలోనూ నన్ను నేను బిజీగా ఉంచుకుంటున్నా. ఇటీవల 'ప్యార్‌ కరోనా..' పాట విడుదల చేశా. 'తేరే బినా..' పాట మే 12న విడుదల కాబోతోంది. నా 15 ఏళ్ల వయసు నుంచి పని చేయడం మొదలుపెట్టా. నా సినిమాలు కొన్నిసార్లు అపజయాలు చూసినప్పటికీ.. నా కెరీర్ ఊహించిన విధంగా లేనప్పటికీ నేను పని చేస్తూనే ఉన్నా. ఇప్పుడూ పనిచేసేందుకే ప్రయత్నిస్తున్నా. నా మైండ్‌లో ఉన్న పాటల్ని కంపోజ్‌ చేసి, యూట్యూబ్‌లో విడుదల చేస్తున్నా. ముగ్గురు వ్యక్తులతో ఓ పాటను షూట్‌ చేయడం ఎంతో సులభం. మేకప్‌ ఆర్టిస్టు, హెయిర్‌ స్టైలిస్ట్‌ అవసరం లేదు. కానీ ఎడిట్‌ చేయడం అంత సులభం కాదు. అందరూ వైఫై వినియోగిస్తుండటం వల్ల ఇంటర్నెట్‌ వేగం తగ్గింది. దీంతో ఓ ఫైల్‌ను డౌన్‌లోడ్‌ చేయడానికి 24 నుంచి 36 గంటలు పడుతోంది. చివరికి పాటను ఎడిట్‌ చేసి, టీజర్‌ను విడుదల చేశాం' -సల్మాన్​ఖాన్, బాలీవుడ్ కథానాయకుడు

'తేరే బినా..' పాట టీజర్‌ను ఆదివారం విడుదల చేశారు. ఇందులో సల్మాన్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ జంటగా కనిపించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.