Salman Khan IIFA Awards: బాలీవుడ్‌కు ఎంతో ఇష్టమైన అవార్డుల వేడుక 'ది ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడెమీ అవార్డ్స్' (ఐఫా). పురస్కారాలు అందుకోవడమే కాకుండా.. తారలందరూ ఒకచోట చేరి ఆటపాటలతో సందడి చేసే కార్యక్రమం అది. వచ్చే ఏడాది జరగనున్న ఈ పురస్కారాల వేడుకకు ఈ సారి అబుదాబి వేదిక కానుంది. 22వ 'ఐఫా' వేడుకలు అబుదాబిలోని యస్ ఐల్యాండ్‌లో వచ్చే ఏడాది మార్చి 18, 19 తేదీల్లో జరగనున్నట్టు నిర్వాహకులు మంగళవారం ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ బాలీవుడ్ కథానాయకుడు సల్మాన్‌ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు.
"75వ భారత స్వాతంత్య్ర వేడుకలు, యూఏఈ 50 ఏళ్ల పండగ సందర్భంగా 22వ 'ఐఫా' వేడుకను ఘనంగా నిర్వహించనున్నాం. భారతీయ చిత్ర సీమ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పే గొప్ప కార్యక్రమంగా ఈ వేడుకను నిర్వహిస్తాం" అని 'ఐఫా' నిర్వాహకులు ప్రకటించారు.
ఇదీ చూడండి: బాలీవుడ్ కాదు.. నా టార్గెట్ అదే: అల్లు అర్జున్