ETV Bharat / sitara

Salman Khan: సూపర్‌హిట్‌ చిత్రానికి సీక్వెల్‌ ప్రకటించిన సల్మాన్‌ఖాన్‌ - బజరంగీ భాయిజాన్‌ సీక్వెల్

Salman Khan: తన సూపర్​హిట్​ చిత్రానికి సీక్వెల్ ప్రకటించారు బాలీవుడ్​ కండల వీరుడు సల్మాన్​ ఖాన్. 2015లో వచ్చిన 'బజరంగీ భాయిజాన్​' సినిమాకు కొనసాగింపుగా మరో చిత్రాన్ని తీసుకురానున్నట్లు తెలిపారు.

salman khan
సల్మాన్​ ఖాన్
author img

By

Published : Dec 20, 2021, 7:24 AM IST

Salman Khan: బాలీవుడ్‌ అత్యుత్తమ చిత్రాల్లో 'బజరంగీ భాయిజాన్‌' ఒకటి. ప్రముఖ నటుడు సల్మాన్‌ ఖాన్‌ నటించిన ఈ చిత్రం అందరి హృదయాల్ని హత్తుకుంది. బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఈ భావోద్వేగ సినిమాకి సంబంధించి సల్మాన్‌ ఓ శుభవార్త వినిపించారు. ఈ సూపర్‌హిట్‌ చిత్రానికి సీక్వెల్‌ తీసుకొస్తున్నట్టు ఆదివారం ప్రకటించారు.

salman khan
'బజరంగీ భాయిజాన్​'

'బజరంగీ..'కి కథ అందించిన విజయేంద్ర ప్రసాదే (దర్శకుడు రాజమౌళి తండ్రి) కొనసాగింపు చిత్రానికీ కథ అందిస్తారని తెలిపారు సల్మాన్. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి. కబీర్‌ఖాన్‌ దర్శకత్వం వహించిన 'బజరంగీ..' 2015 జులై 17న విడుదలైంది. పాకిస్థాన్‌కు చెందిన మూగ, చెవిటి చిన్నారిని తన కన్నవారి వద్దకు చేర్చేందుకు భారతీయ యువకుడు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడనేది ఈ చిత్ర కథ.

ఇదీ చూడండి:

'ఆర్ఆర్ఆర్' రిలీజ్.. ఎవరూ ఆ సాహసం చేయొద్దు: సల్మాన్​ఖాన్

అబుదాబి వేదికగా ఐఫా వేడుక.. వ్యాఖ్యాతగా సల్మాన్‌

చిరు సినిమాలో నటిస్తున్నా: సల్మాన్ క్లారిటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.