'జనతా కర్ఫ్యూ' అంటే పబ్లిక్ హాలీడే కాదని.. ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం కావాలని బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ కోరాడు. ఇన్‌స్టా వేదికగా వీడియో సందేశాన్ని పోస్ట్ చేశాడు. కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా ఆదివారం ఉదయం 7గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం కావాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మద్దతు ప్రకటించాడు సల్మాన్. పలువురు సెలబ్రిటీలు ఈ 'జనతా కర్ఫ్యూ'కు తమ మద్దతు తెలిపారు.
"అందరికీ నమస్కారం. నా పేరు సల్మాన్‌ఖాన్. కరోనా వైరస్ వల్ల ఏర్పడ్డ క్లిష్ట పరిస్థితుల్లో కూడా మన కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తోన్న వారందరికీ నా కృతజ్ఞతలు. ఈ రోజు నా విజ్ఞప్తి ఏంటంటే.. ప్రభుత్వం చెబుతున్న నియమాలను పాటించండి. ఎలాంటి పుకార్లను వ్యాప్తి చేయకండి. కరోనా వైరస్‌కు ఎవరూ అతీతులు కాదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కనీస జాగ్రత్తలను పాటించి.. బయటకు రాకండి. ఇది పబ్లిక్ హాలీడే కాదు."
-సల్మాన్ ఖాన్, బాలీవుడ్ హీరో.
కరోనా వైరస్ (కొవిడ్-19) రోజురోజూకీ విషపు కోరలు చాస్తున్న తరుణంలో సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలందరూ ఇంటికే పరిమితమయ్యారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇదీ చూడండి : 'అబద్ధం' చెప్పారని పవన్, రజనీ ట్వీట్స్ డిలీట్