ప్రతి ఏడాది ఈద్ కానుకగా ఏదో ఒక సినిమాను విడుదల చేసే సల్మాన్ వచ్చే సంవత్సరం 'కిక్-2'తో రాబోతున్నాడని అంతా భావించారు. అయితే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేశాడు నిర్మాత సాజిద్ నడియావాలా.
"నేను సల్మాన్‌ను కలిశాక 'కిక్ 2'పై ఎన్నో ఊహాగానాలు వచ్చాయి. చిత్రీకరణ పూర్తయిపోయి.. ఈద్‌కు విడుదలైపోతుందని అనుకున్నారు. అయితే, ప్రస్తుతం కథ పూర్తవ్వడానికే ఇంకో నాలుగు నుంచి ఆరు నెలలు పట్టొచ్చు. అందుకే ఈద్‌కు వచ్చే అవకాశం లేదు." -సాజిద్ నడియావాలా, నిర్మాత
సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో వస్తోన్న 'ఇన్షా అల్లా'ను ఈద్‌కు విడుదల చేద్దామని భావించాడు సల్మాన్. ఈ సినిమా చిత్రీకరణ మెదలవ్వకముందే ఆగిపోయింది. ఈ విషయంపై భాయ్‌జాన్ ట్వీట్ చేస్తూ వచ్చే ఏడాది ఈద్‌కు 'ఇన్షా అల్లా' రావట్లేదని ప్రకటించాడు. కానీ పండుగకు మరో సినిమాతో మీ ముందుకు వస్తానని తెలిపాడు. ఫలితంగా అందరూ 'కిక్ 2' ఈద్‌కు వస్తుందని భావించారు.
2014లో విడుదలైన 'కిక్' మంచి విజయం అందుకుంది. ప్రస్తుతం 'కిక్ 2'ను ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కించి రంజాన్‌కు విడుదల చేయాలని సల్మాన్ భావిస్తున్నాడని సమాచారం.
ప్రస్తుతం సల్మాన్ ప్రభుదేవా దర్శకత్వంలో 'దబాంగ్ 3'లో నటిస్తున్నాడు. ఈ చిత్రం డిసెంబర్లో విడుదలకానుంది.
ఇదీ చూడండి: అదిరే లుక్‌లో బాలయ్య... త్వరలో రామోజీ ఫిల్మ్‌సిటీకి...