ETV Bharat / sitara

సాయితేజ్ కొత్త సినిమాకు పవర్​స్టార్ క్లాప్

author img

By

Published : Mar 12, 2020, 10:45 AM IST

కథానాయకుడు సాయితేజ్​ కొత్త సినిమా ఈరోజు లాంఛనంగా మొదలైంది. ఈ కార్యక్రమానికి పవన్​కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.

సాయితేజ్ కొత్త సినిమాకు పవర్​స్టార్ క్లాప్
సాయితేజ్​తో పవర్​స్టార్ పవన్​కల్యాణ్

'చిత్రలహరి', 'ప్రతిరోజూ పండగే' సినిమాలతో గతేడాది హిట్లు కొట్టిన మెగాహీరో సాయితేజ్​... ప్రస్తుతం 'సోలో బ్రతుకే సో బెటర్'​లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు మరో చిత్రాన్ని మొదలుపెట్టేశాడు. హైదరాబాద్​లో నేడు(గురువారం) లాంఛనంగా ప్రారంభమైంది. పవర్​స్టార్ పవన్​కల్యాణ్​ ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టాడు. ఈ కార్యక్రమానికి బీవీఎస్​ఎన్ ప్రసాద్, అల్లు అరవింద్, వంశీ పైడిపల్లి వచ్చారు.

pawan saitej
క్లాప్ కొడుతున్న పవర్​స్టార్ పవన్​కల్యాణ్
pawan kalyan with sdt14 team
దర్శకుడు దేవాకట్టా, హీరోహీరోయిన్లతో పవన్​కల్యాణ్

ఈ సినిమాలో నివేదా పేతురాజ్ హీరోయిన్​గా నటిస్తోంది. గతంలో 'చిత్రలహరి'లో వీరిద్దరూ కలిసి నటించారు. ఇప్పుడు మరోసారి కలిసి పనిచేసేందుకు సిద్ధమవుతున్నారు. 'ప్రస్థానం' ఫేమ్ దేవాకట్టా దర్శకుడు. భగవాన్, పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలో పూర్తి వివరాలు ప్రకటించనున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.