తన కుమార్తె, నటి సారా అలీఖాన్‌ను స్ర్కీన్‌పై చూడడం ఎంతో సరదాగా ఉందని స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ అన్నారు. వరుణ్‌ధావన్, సారా అలీఖాన్ జంటగా నటించిన 'కూలీ నం.1' అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు మిశ్రమ స్పందనలు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా నటుడు సైఫ్.. సారా అలీఖాన్‌ను ఆన్‌స్ర్కీన్‌పై చూడడం గురించి స్పందించారు.
" ప్రస్తుతానికి నేనింకా 'కూలీ నం.1' ట్రైలర్ చూడలేదు. కానీ ఈ సినిమాకు సంబంధించిన కొన్ని వీడియో సాంగ్స్‌ను సారా నాకు ప్రత్యేకంగా చూపించింది. సారా.. తన పాత్రను పూర్తిగా ఎంజాయ్ చేస్తూ నటించిందని ఆ వీడియోలు చూస్తే అర్థమైంది. స్ర్కీన్‌పై సారాని చూడడం ఎంతో సరదాగా అనిపించింది. ఎందుకంటే తను నా కళ్లకు ఇప్పటికీ ఓ చిన్నపిల్లలా కనిపిస్తుంది" అని సైఫ్ అలీఖాన్ అన్నాడు.
'తానాజీ' విజయంతో ఇటీవల ప్రేక్షకులను మెప్పించిన సైఫ్ ప్రస్తుతం 'ఆదిపురుష్' సినిమా కోసం సిద్ధమవుతున్నారు. ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కనున్న ఈ సినిమాలో సైఫ్ రావణుడి పాత్రలో మెప్పించనున్నారు. ఓంరౌత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
ఇదీ చదవండి:మీ వదినను పరిచయం చేస్తా.. అభిమానులతో వరుణ్