మెగాహీరో సాయిధరమ్ తేజ్ నటిస్తున్న 'ప్రతిరోజూ పండగే' సినిమా.. మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ చిత్రంలో ఓ ఫైట్ కోసం సిక్స్ ప్యాక్‌లో కనిపించనున్నాడీ కథానాయకుడు. అయితే ఆ పాత్ర కోసం ఇలా సిద్ధమయ్యాడంటూ ఓ వీడియోను పంచుకుంది చిత్రబృందం.
ఇందులో హీరోయిన్గా రాశీఖన్నా నటించింది. సత్యరాజ్ కీలక పాత్ర పోషించాడు. తమన్ సంగీతమందించాడు. మారుతి దర్శకత్వం వహించాడు. గీతా ఆర్ట్స్, జీఏ2 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాయి.
ఇది చదవండి: 'ప్రతిరోజూ పండగే' సినిమా టికెట్లు అమ్మిన హీరోయిన్ రాశీ ఖన్నా