ETV Bharat / sitara

మంచు మనోజ్​ సినిమాలో మెగా హీరో! - aham bramhasmi sai dharam tej

మంచు మనోజ్​ నటిస్తున్న 'అహం బ్రహ్మాస్మి' సినిమాలో మెగాహీరో సాయిధరమ్​ తేజ్​ అతిథి పాత్ర పోషించబోతున్నట్లు సమాచారం. త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశముంది. ఈ విషయం గురించి నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు.

manoj
మంచు మనోజ్​
author img

By

Published : Mar 22, 2021, 3:06 PM IST

మంచు, మెగా కుటుంబాలకు చెందిన హీరోలు కలిసి నటిస్తే చూడాలనుకునే సినీ ప్రియుల ఆశ త్వరలోనే నెరవేరేలా కనిపిస్తోంది. మంచు మనోజ్​, సాయిధరమ్​ తేజ్​ కలిసి వెండితెరపై సందడి చేయనున్నారని సమాచారం.

manoj
మంచు మనోజ్​

కొన్నేళ్ల విరామం తర్వాత మనోజ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'అహం బ్రహ్మాస్మి'. శ్రీకాంత్‌ ఎన్‌.రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మనోజ్‌ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాలో హీరో సాయిధరమ్‌ తేజ్‌ ఓ అతిథి పాత్రలో మెప్పించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్నో సంవత్సరాల నుంచి మనోజ్‌తో స్నేహం ఉండడం వల్ల ఆయన అడిగిన వెంటనే సినిమాలో నటించేందుకు సాయి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

చిరు-మోహన్‌బాబు కలిసి నటించిన 'బిల్లారంగా'ను మనోజ్‌, సాయిధరమ్‌ తేజ్‌ రీమేక్‌ చేయనున్నారంటూ గతంలో వార్తలు వచ్చాయి.

sai dharam tej
సాయి ధరమ్​ తేజ్​

ఇదీ చూడండి: రెండో పెళ్లి గురించి మనోజ్​ క్రేజీ ట్వీట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.