ETV Bharat / sitara

'మేమిద్దరం ఒకే అమ్మాయిని ప్రేమించాం' - latest telugu cinema news

ఎన్ని రక్త సంబంధాలున్నా.. మన బాధను అర్థం చేసుకుని వాటిని కూడా సంతోషంలాగే సమానంగా పంచుకునే ఏకైక వ్యక్తి స్నేహితుడు. ఈ రోజు ఫ్రెండ్​షిప్​ డే. ఈ సందర్భంగా టాలీవుడ్​ హీరో సాయి తేజ్​ స్నేహం గురించి ఏం చెప్పారో వినేద్దాం రండి.

saidharam tej interview about friendship day
సాయి తేజ్​
author img

By

Published : Aug 2, 2020, 6:40 AM IST

కష్టం వస్తుంది. కన్నీళ్లు కారిపోతుంటాయి. అప్పుడే 'మామా... నేనున్నా' అంటూ ఓ చేయి భుజంపై పడుతుంది. కొండంత అండలా భుజాన్ని తాకిన ఆ చేయి పేరే... స్నేహం. కష్టాన్నైనా, కన్నీళ్లయినా వన్‌ బై టు ఛాయ్‌లాగా పంచుకునేవాడే స్నేహితుడు. ఓటమి ఎదురైనా సరే... 'ఏం పర్లేదు, నువ్వు సాధిస్తావు' అంటూ వెన్నుతట్టి వెనక నిలిచేవాడు స్నేహితుడు. అలాంటి స్నేహాలు నా జీవితంలోనూ ఉన్నాయంటున్నాడు యువ కథానాయకుడు సాయి తేజ్‌. ఆదివారం స్నేహితుల దినోత్సవం. ఈ సందర్భంగా తేజ్‌ చెప్పిన విశేషాలివీ.

స్నేహం అనగానే గుర్తుకొచ్చే విషయం ఏంటి?

మనతోపాటే నీడలా ఉండే ఒక ధైర్యమే స్నేహం అంటే. మన నీడని మనం ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటామా? స్నేహం కూడా అంతే. ఎక్కువగా స్నేహితుల మధ్యే నా జీవితం గడిచిపోతుంటుంది.

కరోనా ప్రభావంతో కొన్ని నెలలుగా స్నేహితుల్ని బాగా మిస్‌ అయ్యుంటారేమో కదా?

మిస్‌ కావడం అంటూ ఏమీ ఉండదు. కొంచెం బోర్‌ కొడితే చాలు... అప్రయత్నంగా స్నేహితుల్లో ఒకరికి ఫోన్‌ కాల్‌ కనెక్ట్‌ అయిపోతుందంతే. వాళ్లు కూడా అంతే, తరచూ ఎవరో ఒకరు ఫోన్‌ చేసి మాట్లాడుతూనే ఉంటారు. నటుడు నరేష్‌గారి అబ్బాయి నవీన్‌ నాకు బెస్ట్‌ ఫ్రెండ్‌. మేం మాట్లాడుకుంటూనే ఉంటాం. ఇంటర్‌ కాలేజీలో మాది ఐదుగురితో కూడిన ఒక బ్యాచ్‌ ఉండేది. నేను, స్రవంత్‌, దినేష్‌, శ్రవణ్‌, ఫణి.. ఈ బ్యాచ్‌లో మేమంతా ఇప్పటికీ కలిసే ఉంటున్నాం. ఇందులో ఇద్దరు అమెరికాలో ఉంటారు.

ఎవరికైనా జీవితంలో ఆటుపోట్లు సహజం. అలాంటి సమయాల్లో స్నేహితుల పాత్ర కీలకం కదా?

మన విజయాన్ని మన స్నేహితులు ఆస్వాదిస్తారు. మన ఓటమి భారాన్ని కూడా వాళ్లు పంచుకోవడానికి ముందుకొస్తుంటారు. అదే స్నేహం గొప్పతనం. మనం సంతోషంగా ఉన్నప్పుడే కాదు, కష్టం వచ్చినా, నష్టం ఎదురైనా.. మనతోపాటే ప్రయాణం చేయడానికి ముందుకొస్తాడు స్నేహితుడు. నా జీవితంపై స్నేహం ప్రభావం చాలా ఉంటుంది. స్నేహం పేరుతో ఒక చేయి మన భుజంపై పడితే వాళ్ల విషయంలో మనమూ అంతే నమ్మకంగా, నిజాయతీగా ఉండాలి. అప్పుడే ఆ బంధం నిలుస్తుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మీ తోటి కథానాయకుల్లో ఒక్కొక్కరు వైవాహిక జీవితంలోకి అడుగు పెడుతున్నారు. మీరు ఇంకా ‘సోలో బ్రతుకే సో బెటరూ’ అంటున్నారేమిటి?

ఇంకొన్నాళ్లు సోలోనే నేను. నాకు బాధ్యతలు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. వ్యక్తిగతంగా చక్కబెట్టాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. ఎప్పుడైనా, ఏ బంధంలోకి వెళ్లినా దానికి ఎక్కువ సమయం ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే తప్పంతా మనదే అవుతుంది. అలా చేయడం నాకు ఇష్టం ఉండదు. అందుకే సమయం ఇచ్చే పరిస్థితులు ఉన్నప్పుడే పెళ్లి చేసుకుందాం అనుకున్నా.

మరి ఇంట్లోవాళ్లు ఒత్తిడి చేయడం లేదా?

మొదట్లో మాటిమాటికీ 'పెళ్లెప్పుడు చేసుకుంటావు రా' అనేవాళ్లు. ఇప్పుడు నేను కష్టపడే విధానం చూసి అమ్మ 'ఇప్పుడెందుకు వాణ్ని తొందరపెట్టడం, ఎప్పుడు అనిపిస్తే అప్పుడు చేసుకుంటాడులే' అంటుంటారు. పాపం ఇప్పుడే ఇంత కష్టపడుతున్నాడు, పెళ్లి చేసుకుంటే ఇంకెంత కష్టపడాల్సి వస్తుందో కదా అంటూ దయ చూపుతున్నారు మా కుటుంబ సభ్యులు (నవ్వుతూ).

చిత్రీకరణల కోసం ఎప్పుడు రంగంలోకి దిగుతారు?

సెప్టెంబరులో అనుకుంటున్నా. ఒక వారం రోజులు పనిచేస్తే 'సోలో బ్రతుకే సో బెటరూ' పూర్తవుతుంది.

కాలేజీ రోజుల్లో 'ప్రేమదేశం' తరహాలోనే ఒక నాటకీయమైన సంఘటన నా జీవితంలో జరిగింది. నాకూ, నా స్నేహితుల్లో ఒకరికి ఓ అమ్మాయితో పరిచయం పెరిగింది. ఒకరికి తెలియకుండా మరొకరు ఆ అమ్మాయిని ప్రేమించాం. కొన్నాళ్లకి ఆ అమ్మాయి కాలేజీ వదిలిపెట్టి వెళ్లిపోయింది. అప్పుడు ఇద్దరం ఎవరికివాళ్లు తెగ బాధపడుతున్నాం. ఒకడిని చూసి మరొకడు ‘ఏమైంది, అంతగా బాధపడుతున్నావ్‌’ అంటూ మాట్లాడుకున్నాం. అప్పుడు ఇద్దరం ఆ అమ్మాయినే ప్రేమించామన్న విషయం అర్థమైంది. అప్పుడు ‘ముందు నువ్వెందుకు చెప్పలేదు, నువ్వెందుకు చెప్పలేదు’ అని గొడవపడ్డాం. ఆ తర్వాత మా మధ్య అనుబంధం మరింత బలంగా తయారైంది. కాలేజీ రోజుల్లో స్నేహితుల మధ్య జరిగిన సంఘటనలు గుర్తుకొస్తే ఆ అనుభూతే వేరు.’’

వెబ్‌ సిరీస్‌లు చేస్తే బాగుంటుందేమో అన్న ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా?

నేను ఇది మాత్రమే చేయాలని ఎప్పుడూ అనుకోను. మంచి కథ అనిపిస్తే కచ్చితంగా చేయడానికి సిద్ధమే. నాకు కథే ముఖ్యం. ప్రేక్షకులకు ఈ కథతో పరిపూర్ణంగా వినోదం అందించగలుగుతా అనిపిస్తే చాలు. ఇంకేమీ ఆలోచించను.

మీ తమ్ముడు వైష్ణవ్‌ తేజ్‌ నటించిన 'ఉప్పెన' విడుదలకి ముందే లాక్‌డౌన్‌ని ప్రకటించారు. ఆయనకిదే తొలి సినిమా కదా, నిరుత్సాహపడ్డారా?

వైష్ణవ్‌ మానసికంగా చాలా బలంగా ఉంటాడు. ఇంకో రిలీజ్‌ డేట్‌కి వస్తుంది కదా అంటాడు కానీ.. దిగులు పడే వ్యక్తిత్వం మాత్రం కాదు. ఏది జరిగినా మన మంచికే అనుకుంటాడు. 'అన్నా.. మనిద్దరి తొలి సినిమాల విడుదలలూ ఆలస్యమయ్యాయి. ఏదో ఉందం'టూ మొన్ననే సరదాగా చెప్పాడు. మేం కూడా ఇంకా 'ఉప్పెన' సినిమాని చూడలేదు. చిరంజీవి మావయ్య చూశాక మేం చూస్తాం.

స్నేహం నేపథ్యంలో సినిమా చేసే ఆలోచనలేమైనా ఉన్నాయా?

'ప్రేమదేశం' సినిమా గుర్తుకొచ్చినప్పుడంతా స్నేహం నేపథ్యంలో ఓ సినిమా చేయాలి అనిపిస్తుంది. చదువుకునే రోజుల్లో నాపైన బాగా ప్రభావం చూపించిన సినిమా అది. ఫేర్‌వెల్‌ వేడుకల్లో 'ముస్తఫా ముస్తఫా..' పాటని తెగ పాడుకునేవాళ్లం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.