ETV Bharat / sitara

'అత్యంత విభిన్న పాత్రలో మెప్పిస్తా' - పావ కదైగల్ గురించి సాయి పల్లవి

హైబ్రిడ్ పిల్ల సాయి పల్లవి నటించిన నెట్​ఫ్లిక్స్ చిత్రం 'పావ కదైగల్'. తమిళ దర్శకులు గౌతమ్ మేనన్, వెట్రిమారన్, సుధాకొంగర, విఘ్నేశ్ శివన్.. నాలుగు కథలతో దీన్ని రూపొందించారు. డిసెంబర్ 18న ఈ చిత్రం విడుదలవబోతున్న నేపథ్యంలో సాయిపల్లవి పలు విషయాలు పంచుకున్నారు.

Sai pallavi about Paava paava kadhaigal movie
'అత్యంత విభిన్న పాత్రలో మెప్పిస్తా'
author img

By

Published : Dec 8, 2020, 10:28 AM IST

సినిమా సెట్‌లో ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌ను చూసి చాలా భయపడ్డానని కథానాయిక సాయిపల్లవి వెల్లడించారు. ఆమె నటించిన చిత్రం 'పావ కదైగల్‌'. తమిళ దర్శకులు గౌతమ్‌ మేనన్‌, వెట్రి మారన్‌, సుధా కొంగర, విఘ్నేశ్‌ శివన్‌.. నాలుగు కథలతో దీన్ని రూపొందించారు. సాయిపల్లవి తండ్రిగా ప్రకాశ్‌ రాజ్‌ నటించారు. సిమ్రన్‌, అంజలి, జయరాం, కల్కి కొచ్లిన్‌, గౌతమ్‌ మేనన్‌ తదితర పాత్రల్లో కనిపించనున్నారు. డిసెంబరు 18న చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కాబోతోంది.

సాయిపల్లవి తాజాగా ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రకాశ్‌ రాజ్‌తో కలిసి పనిచేయడం గురించి ప్రశ్నించగా.. "తండ్రిగా ప్రకాశ్‌ రాజ్‌ సెట్‌లో నడుచుకుని వస్తుంటే.. ఆయన గాంభీర్యం చూసి చాలా భయపడేదాన్ని. ఆయన దాదాపు సెట్‌లో క్యారెక్టర్‌లో ఉండేవారు" అని అన్నారు.

Sai pallavi about Paava paava kadhaigal movie
సాయిపల్లవి, ప్రకాశ్ రాజ్

అనంతరం వైద్య వృత్తి గురించి అడగగా.. "సినిమాల్లో నటించడం పూర్తయ్యాక కచ్చితంగా వైద్య వృత్తిపై దృష్టి పెడతా, దాన్నే కొనసాగిస్తా. ఈ విషయంలో ఎటువంటి అనుమానం లేదు. దీన్ని ఎప్పుడో నిర్ణయించుకున్నా.. వైద్య వృత్తిపై నాకెంతో గౌరవం ఉంది" అని ఆమె చెప్పారు.

సాయి పల్లవి

దర్శకుడు శేఖర్‌ కమ్ములతో కలిసి 'ఫిదా', 'లవ్‌స్టోరీ' కోసం పనిచేయడం గురించి మాట్లాడుతూ.. "నాకు విజ్ఞానం అందించిన వ్యక్తుల్లో శేఖర్‌ కమ్ముల ఒకరు. నాకు మార్గదర్శకాలు ఇస్తుంటారు.." అని సాయిపల్లవి అన్నారు. 'కాళి' (హే పిల్లగాడ) తర్వాత తను పోషించిన అత్యంత విభిన్నమైన పాత్ర ఇదని.. 'పావకదైగల్‌' గురించి చెప్పారు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.