ETV Bharat / sitara

'ఆయన నాకు దర్శకుడి కన్నా ఎక్కువ'

జీవితాన్ని భిన్న కోణంలో చూసే విధంగా తనను దర్శకుడు శేఖర్​ కమ్ముల తీర్చిదిద్దారని చెప్పింది హీరోయిన్ సాయిపల్లవి. ఆయన తనకు దర్శకుడు కన్నా ఎక్కువేనని తెలిపింది.

sai
సాయి
author img

By

Published : Dec 30, 2020, 9:07 AM IST

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్​ తేజ్​, సాయిపల్లవి జంటగా నటించిన సినిమా 'ఫిదా'. 2017లో విడుదలైన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. అయితే ఈ సినిమా చిత్రీకరణ సమయంలో తాను ఎన్నో అనుభవాలను పొందానని చెప్పింది సాయిపల్లవి. తన జీవితాన్ని విభిన్న కోణంలో చూసేలా ఇవి ఉపయోగపడ్డాయని తెలిపింది.

"ఆయన నాకు దర్శకుడి కన్నా ఎక్కువ. నా జీవితాన్ని సరైన కోణంలో చూసుకునేలా నన్ను తీర్చిదిద్దారు. క్లిష్టపరిస్థితుల్లో ఎవరిమీద ఆధారపడకుండా ధైర్యంగా ఉండేలా, నా హక్కుల పట్ల స్వేచ్ఛగా ఎలా మాట్లాడాలి వంటి విషయాలను నేర్పించారు. సమాజంలో ఓ మహిళగా ఎలా వ్యవహరించాలో అర్థమయ్యేలా చెప్పారు. లేకపోతే ఇంకా గల్లీలో ఆడుకునే చిన్నపిల్లలా ఉండేదాన్ని. ఏదీ తప్పో, ఓప్పో తెలుసుకునే జ్ఞానాన్ని ఆయన నాకు అందించారు.

-సాయిపల్లవి, హీరోయిన్​

సాయిపల్లవి త్వరలోనే హీరో నాగచైతన్యతో కలిసి 'లవ్​స్టోరీ' సినిమాతో ప్రేక్షకులను పలకరించునుంది. ఈ చిత్రానికి కూడా శేఖర కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు.

ఇదీ చూడండి : 'రానా సమానత్వాన్ని విశ్వసించే వ్యక్తి '

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.