చిరు, పవన్‌ల ముద్దుల మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌కి ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. కొంత కాలంగా వెంటాడుతున్న వరుస పరాజయాలకు చెక్ పెడుతూ.. ఈ ఏడాది 'చిత్రలహరి', 'ప్రతిరోజూ పండగే' చిత్రాలతో వరుస హిట్లు అందుకున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు.
చిరు, పవన్ సినిమాల రీమేక్‌ల్లో..
ఈ మెగా హీరో తన మేనమామల పాటలు, పేర్లు తన చిత్రాల్లో వాడుకోవడాన్ని సెంటిమెంట్‌గా భావిస్తాడు. తాజాగా వారికి పేరు తెచ్చిన 'చంటబ్బాయ్', 'ఖుషి' చిత్రాల తరహా కథల్లో నటించాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడట. అంతేకాదు అవకాశం దొరికితే తన ఇద్దరు మేనమామలతో చిన్న పాత్ర అయినా సరే తెర పంచుకోవాలని ఉందట.
వరుణ్‌తో మల్టీస్టారర్..
ఇక తనకు వరుణ్ తేజ్, రవితేజతో మల్టీస్టారర్ చేయాలనుందని ఇటీవలే తన మనసులో మాట బయటపెట్టాడు. ప్రస్తుతం ఈ కలయికను తెరపై చూపించేందుకు పలువురు యువ దర్శకులు కథలు సిద్ధం చేసుకునే పనిలో పడ్డట్లు తెలుస్తోంది.
![Sai Dharam Teja Told a Ineresting Matter About his Dreams](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5515015_varun.jpg)
ప్రస్తుతం ఈ మెగా హీరో.. తన తర్వాతి చిత్రాలపై దృష్టి సారిస్తున్నాడు. సోలో బ్రతుకే సో బెటరు సినిమాతో పాటు మరో చిత్రం చర్చల దశలో ఉంది.
ఇదీ చదవండి: 'లవర్‌బాయ్.. లవర్‌బాయ్ అంటే చిరాకొస్తోంది'