టాలీవుడ్ హీరోలు తమ బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పేస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు పెళ్లి శుభవార్త వినిపిస్తున్నారు. ఈ లాక్డౌన్ సమయంలోనే నిఖిల్, నితిన్, రానా పెళ్లిళ్లు చేసుకుని ఓ ఇంటివారయ్యారు. ఇప్పుడు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ వంతు వచ్చిందా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఇన్ని రోజులు 'సోలో బ్రతుకే సో బెటర్' అంటూ చెప్పిన తేజ్ ఇప్పుడు మనసు మార్చుకున్నాడా అనుకుంటున్నారు. తాజాగా ఈ హీరో నెట్టింట షేర్ చేసిన వీడియోతో ఈ అనుమానాలు రేకెత్తుతున్నాయి.
సింగిల్ ఆర్మీ అనే వాట్సప్ గ్రూప్ నుంచి ఒక్కొక్క హీరో లెఫ్ట్ అవుతున్నట్లు ఉన్న యానిమేషన్ వీడియో ఆకట్టుకుంటోంది. చివర్లో 'సారీ ప్రభాస్ అన్న' అంటూ తేజ్ ముగించాడు. సోమవారం ఉదయం 10 గంటలకు శుభవార్త చెబుతా అంటూ వెల్లడించాడు. దీనిపై నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 'ఇది సోలో బ్రతుకే సో బెటర్ సినిమా ప్రమోషన్స్ కదా' అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
-
ఒక్కో సారి మనం ఎన్నో అనుకుంటాం కానీ ఆ టైం వచ్చినప్పుడు మరి....
— Sai Dharam Tej (@IamSaiDharamTej) August 23, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
More details tomorrow at 10AM pic.twitter.com/5PJZIPuVJu
">ఒక్కో సారి మనం ఎన్నో అనుకుంటాం కానీ ఆ టైం వచ్చినప్పుడు మరి....
— Sai Dharam Tej (@IamSaiDharamTej) August 23, 2020
More details tomorrow at 10AM pic.twitter.com/5PJZIPuVJuఒక్కో సారి మనం ఎన్నో అనుకుంటాం కానీ ఆ టైం వచ్చినప్పుడు మరి....
— Sai Dharam Tej (@IamSaiDharamTej) August 23, 2020
More details tomorrow at 10AM pic.twitter.com/5PJZIPuVJu