సాయిధరమ్ తేజ్, రాశీ ఖన్నా కలిసి నటించిన చిత్రం 'ప్రతిరోజూ పండగే'. ఈ సినిమా చిత్రీకరణ నేటితో పూర్తయింది. ఈ సందర్భంగా ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది చిత్రబృందం. త్వరలోనే 'ఓ బావా' టైటిల్‌తో ఓ పాటను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
యువీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మారుతి దర్శకుడు. తమన్ బాణీలు అందిస్తున్నాడు. కుటుంబ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. 'చిత్రలహరి' హిట్ తర్వాత సాయిధరమ్ నటిస్తున్న సినిమా ఇది. డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">