సాహో విడుదల దగ్గరపడుతున్న కొద్ది ప్రచార వేగాన్ని పెంచింది చిత్రబృందం. ఇప్పటికే ముంబయి, హైదరాబాద్ సహా పలు నగరాల్లో విస్తృతంగా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు ప్రభాస్, శ్రద్ధాకపూర్. తాజాగా చిత్ర విడుదల ముందస్తు వేడుకను ఆగస్టు 18న నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ రామోజీ ఫిల్మ్‌సిటీ వేదిక కానుంది. సాయంత్రం 5గంటలకు ప్రారంభం కానుంది.
సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హీరోహీరోయిన్లు సహా చిత్రప్రముఖులు హాజరు కానున్నారు. ఇప్పటికే సాహో వీడియో గేమ్ టీజర్‌నూ విడుదల చేసింది చిత్రబృందం. ఈ గేమ్‌ను గురువారం ఆవిష్కరించనున్నారు.
యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ - ప్రమోద్ నిర్మిస్తున్నారు. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు 300కోట్లకు పైగా తెరకెక్కించిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇది చదవండి: తమిళ ‘జెర్సీ’లో విశాల్, అమలాపాల్..?