బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సాగర్ సర్హాదీ(88).. అనారోగ్య సమస్యలతో ఆదివారం రాత్రి మృతి చెందారు. ఆయన మేనల్లుడు, దర్శకుడు రమేశ్ తల్వార్ ఈ విషయాన్ని వెల్లడించారు.
పాకిస్థాన్లో పుట్టిన సాగర్.. 12 ఏళ్లున్నప్పుడు కుటుంబంతో సహా దిల్లీకి వలస వచ్చారు. ఉర్దూ కథారచయితగా కెరీర్ ప్రారంభించారు. అమితాబ్ నటించిన 'కబీ కబీ'(1976) సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత సిల్సిలా, చాందిని చిత్రాలతో రచయితగా గుర్తింపు తెచ్చుకున్నారు. బజార్(1982) సినిమాతో దర్శకుడిగా మారి ప్రేక్షకులను మెప్పించారు.