రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా 'సాహో'. ఇటీవలే లీకైన ఓ ఫొటో... డార్లింగ్ ఫ్యాన్స్‌కు మరింత సంతోషం కలిగించింది. ఇప్పుడు మరో విషయాన్ని దర్శకుడు సుజీత్ ఇన్‌స్టాలో పంచుకున్నాడు. షూటింగ్ ఎక్కడ మొదలుపెట్టామో అక్కడే చిత్రీకరణ పూర్తి కానుందని తెలిపాడు. నిర్మాణ అనంతర కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని ఆగస్టు 15న సినిమా విడుదల కానుంది.
శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. అరుణ్ విజయ్, నీల్ నితేశ్... ప్రతినాయక పాత్రల్లో కనిపించనున్నారు. శంకర్ ఎహసన్ లాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మాతగా వ్యవహరిస్తోంది. రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇది చదవండి: రికార్డుల 'సాహో'
- " class="align-text-top noRightClick twitterSection" data="">