ETV Bharat / sitara

'ఆర్​ఆర్​ఆర్'​ ట్రైలర్​ అదరహో​.. తారక్​, చెర్రీ యాక్టింగ్​​ నెక్స్ట్​ లెవెల్ - ఆర్​ఆర్​ఆర్​ ట్రైలర్​ రిలీజ్​

RRR Movie Trailer: దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన 'ఆర్​ఆర్​ఆర్'​ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ యాక్షన్​ సన్నివేశాలు, వారి నటన అదిరిపోయింది.

ఆర్​ఆర్​ఆర్​ ట్రైలర్, RRR trailer
ఆర్​ఆర్​ఆర్​ ట్రైలర్
author img

By

Published : Dec 9, 2021, 10:39 AM IST

Updated : Dec 9, 2021, 12:10 PM IST

అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఆర్​ఆర్​ఆర్​' ట్రైలర్ వచ్చేసింది. ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్‌ సీక్వెన్స్‌లు, రోమాలు నిక్కబొడిచే సన్నివేశాలు, ప్రతి భారతీయుడిలో ప్రేరణ నింపేలా సాగిన డైలాగ్‌ల​తో ట్రైలర్‌ ఆద్యంతం అదరహో అనేలా సాగింది. మొత్తంగా ఈ ట్రైలర్​ సినిమాపై ఆసక్తిని మరింత భారీగా పెంచింది. ఇక, అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, కొమురం భీమ్‌గా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నటన అదిరిపోయింది. "భీమ్‌.. ఈ నక్కల వేట ఎంతసేపు.. కుంభస్థలాన్ని బద్దలుకొడదాం రా' అంటూ రామ్‌చరణ్‌ చెప్పే డైలాగ్‌ ప్రేక్షకుల చేత ఈలలు వేయిస్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

థియేటర్స్​లో ఫ్యాన్స్​ రచ్చ

థియేటర్లలో విడుదలైన 'ఆర్​ఆర్​ఆర్'​ ట్రైలర్​ను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో​ హాళ్లకు తరలివచ్చారు. ఈలలు వేస్తూ పేపర్​ కటింగ్స్​ను గాల్లోకి ఎగరేస్తూ ప్రచార చిత్రాన్ని ఎంజాయ్​ చేశారు. థియేటర్ బయట భారీ సైజ్​ కేక్​లు కట్ చేస్తున్నారు. తారక్​, చెర్రీ ఫ్లెక్సీలకు పూలదండలు వేశారు.టపాసులు కాలుస్తూ సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్​మీడియాలో ట్రెండ్రింగ్​ అవుతున్నాయి.

ఆర్​ఆర్​ఆర్​ ట్రైలర్..​ ఫ్యాన్స్​ రియాక్షన్​

యాక్షన్‌, ఎమోషనల్‌ డ్రామాగా రూపొందిన 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో అల్లూరి సీతరామరాజుగా రామ్‌చరణ్‌, కొమురం భీమ్​గా తారక్‌ నటించారు. ఈ సినిమా విడుదల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య నిర్మించారు. కీరవాణి స్వరాలు అందించారు. ఆలియాభట్‌ , ఒలీవియా మోరీస్‌ కథానాయికలు. శ్రియ, సముద్రఖని, అజయ్‌ దేవ్‌గణ్‌ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, గ్లింప్స్​, 'దోస్తీ', 'నాటు నాటు', 'జనని' పాటలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

ఇదీ చూడండి: 'ఆర్​ఆర్​ఆర్'​ నుంచి 'భీమ్'​ కొత్త లుక్ వచ్చేసింది

Last Updated : Dec 9, 2021, 12:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.