అనుకోని పరిస్థితుల వల్ల వాయిదాపడిన 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్.. కొత్త రిలీజ్ తేదీ ఖరారు చేసుకుంది. డిసెంబరు 9న ఉదయం 10 గంటలకు థియేటర్లలోనే నేరుగా దీనిని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఓ ఫొటోను ట్వీట్ చేశారు.
ఈ సినిమాలో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటించారు. ఆలియాభట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని, శ్రియ కీలకపాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతమందిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. డీవీవీ దానయ్య.. దాదాపు రూ.450 కోట్లతో నిర్మించారు. జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి విడుదల కానుందీ సినిమా.
ఇటీవల ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న 'ఆర్ఆర్ఆర్' దర్శకుడు రాజమౌళి.. "యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతట అవే వస్తాయి. అది ధర్మయుద్ధమైతే విజయం తథ్యం" అని సినిమాలోని డైలాగ్ చెప్పారు. మరి ఈ డైలాగ్ సినిమాలో ఎవరు ఎవరితో అన్నారో తెలియాలంటే చిత్ర రిలీజ్ వరకు ఆగాల్సిందే.
మరోవైపు కరోనా కొత్త వేరియెంట్ భయం 'ఆర్ఆర్ఆర్' సినిమాను వెంటాడుతోంది. ఒకవేళ 'ఒమిక్రాన్' కేసులు ఎక్కువై, థియేటర్లు మూసివేయాల్సిన పరిస్థితి వస్తే మాత్రం ఈ సినిమా వాయిదా పడే అవకాశముంది! ప్రస్తుతం ఎలాంటి సమస్య లేనప్పటికీ, రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందనేది చూడాలి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి:
- 'ఆర్ఆర్ఆర్' డైలాగ్ రివీల్ చేసిన రాజమౌళి
- ఒమిక్రాన్ భయం.. సంక్రాంతికి సినిమాలు రిలీజ్ కష్టమేనా?
- ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెబుతా: రాజమౌళి
- 'ఆర్ఆర్ఆర్'లో ఆలియా భట్ పాత్ర 15 నిమిషాలేనా?
- Naatu Naatu song: తారక్- చెర్రీ ఎన్ని టేక్స్ తీసుకున్నారంటే?
- 'చిరు చేయలేకపోయారు.. అందుకే చరణ్‌తో ఆ సీన్ చేయించా'
- టిక్కెట్ ధరల తగ్గింపుపై 'ఆర్ఆర్ఆర్' అసంతృప్తి