RRR movie: సినిమా ప్రచారంలో భాగంగా 'ఆర్ఆర్ఆర్' టీమ్ ముంబయిలో ఉంది. స్టార్ హీరో రానా.. డైరెక్టర్ రాజమౌళి, హీరోలు రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లతో తీసుకున్న ఫొటోను ట్వీట్ చేశారు. రానా.. ఈ ముగ్గురిని ఇంటర్వ్యూ చేశారని, అది త్వరలో రిలీజ్ కానుందని చిత్రబృందం వెల్లడించింది.

అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ నటించిన 'ఆర్ఆర్ఆర్'.. జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. అజయ్ దేవ్‌గణ్ కీలకపాత్ర పోషించారు. కీరవాణి సంగీతమందించారు. డీవీవీ దానయ్య రూ.450 కోట్లతో ఈ సినిమాను నిర్మించారు.
Dhanush telugu movie: తమిళ హీరో ధనుష్.. తెలుగులో నేరుగా రెండు సినిమాలు చేస్తున్నారు. అందులోని వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న చిత్రం నుంచి అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా టైటిల్ లుక్‌ను గురువారం ఉదయం 9:36 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు.

ఈ సినిమా తెలుగు-తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. మరోవైపు శేఖర్ కమ్ములతోనూ ధనుష్ సినిమా చేయనున్నారు.
*శ్రీవిష్ణు హీరోగా నటించిన 'భళా తందనాన' షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని చెబుతూ, ఫస్ట్‌లుక్ కూడా విడుదల చేసింది. ఇందులో శ్రీవిష్ణు గన్ పట్టుకుని నిల్చుని ఉన్నారు.

ఈ సినిమాలో కేథరిన్ హీరోయిన్. మణిశర్మ సంగీతమందించారు. చైతన్య దంతులూరి దర్శకత్వం వహిస్తున్నారు. వారాహి చలనచిత్రం ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

ఇవీ చదవండి:
- 'ఆర్ఆర్ఆర్'లో అదిరిపోయే సీన్.. సీక్రెట్ రివీల్ చేసిన జక్కన్న
- 'ఆర్ఆర్ఆర్' రిలీజ్.. ఎవరూ ఆ సాహసం చేయొద్దు: సల్మాన్‌ఖాన్
- RRR movie: రాబోయే మూడు వారాలు రచ్చ రచ్చే!
- భాష ఏదైనా.. పాత్రకు న్యాయం చేయడమే ముఖ్యం: ధనుష్
- ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు: ధనుష్
- ఆరు నిమిషాల్లోనే సూపర్ హిట్ పాట రాసిన స్టార్ హీరో ధనుష్
- వీడు హీరోనా అన్నారు.. బోరున ఏడ్చేశా: ధనుష్