RRR Movie: 'ఆర్ఆర్ఆర్' సినిమాలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. జనవరి 7న చిత్రం థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ట్రైలర్, పోస్టర్లు రిలీజయ్యాయి. అయితే.. ఈ సినిమా ప్రచారం జోరుగా సాగుతోంది. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లను ఇప్పటికే నిర్వహించింది చిత్రబృందం. కర్ణాటకలో జనవరి 2న ఈవెంట్ నిర్వహణకు సిద్ధమవుతోంది.
![ram charan ntr rajamouli](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14059440_rrr-movie.jpg)
కర్ణాటకలో జరిగే 'ఆర్ఆర్ఆర్' ఈవెంట్‌కు ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ముఖ్య అతిథిగా హాజరుకానున్నారట. సీఎంతో పాటు హీరోలు యష్, డాక్టర్ శివ రాజ్‌కుమార్(నిమ్మ శివన్న), ధృవ సర్జా అతిథులుగా విచ్చేయనున్నారని సమాచారం.
దాదాపు రూ.450 కోట్లతో నిర్మించిన ఈ భారీ బడ్జెట్ సినిమాలో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. రాజమౌళి దర్శకత్వం వహించారు. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి:
- 'ఆర్ఆర్ఆర్'లో ఆ ఇద్దరివి గెస్ట్ రోల్స్: రాజమౌళి
- 'ఆర్ఆర్ఆర్' ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం 65 రాత్రులు
- 'ఆర్ఆర్ఆర్' రిలీజ్‌పై సందేహాలు.. రాజమౌళి క్లారిటీ
- Rajamouli: 'తారక్, చరణ్ వేర్వేరు ధ్రువాలు.. 'ఆర్ఆర్ఆర్' కోసం కలిశారు'
- 'ఆర్ఆర్ఆర్'లోని ప్రతి సీన్ మళ్లీ చేసేందుకు రెడీ: ఎన్టీఆర్
- 'రాజమౌళిని నమ్మి రూ.1000 కోట్లయినా పెట్టొచ్చు'
- రాజమౌళి డ్రీమ్‌ప్రాజెక్ట్ 'మహాభారతం'లో చరణ్-ఎన్టీఆర్
- RRR movie: రాజమౌళితోనే అది సాధ్యమైంది- హీరో రామ్‌చరణ్
- నా జీవితాన్ని ఇంతలా మార్చింది రాజమౌళినే: ఎన్టీఆర్
- RRR movie: రిలీజ్‌కు ముందే కలెక్షన్లలో 'ఆర్ఆర్ఆర్' రికార్డు