దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమా డిజిటల్ హక్కులు రికార్డు ధరకు అమ్ముడయ్యాయా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. భారతీయ సినీ పరిశ్రమలో ఎన్నడూ లేనంత భారీ ధరకు ఈ హక్కులను ఓ ప్రముఖ ఛానల్ సొంతం చేసుకుందని ప్రచారం జరుగుతోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలకు సంబంధించిన డిజిటల్ హక్కులు రూ.325 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక వివరాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో రామ్‌చరణ్, తారక్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఆలియాభట్, ఒలీవియా మోరీస్ కథానాయికలు. డీవీవీ దానయ్య నిర్మాత. కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది.
ఇదీ చూడండి.. 'ఆర్ఆర్ఆర్' రిలీజ్‌పై రూమర్లు.. పోస్టర్‌తో క్లారిటీ!