'ఆర్ఆర్ఆర్' షూటింగ్ దాదాపు పూర్తయిందని వెల్లడిస్తూ చిత్రబృందం ఓ కొత్త పోస్టర్ విడుదల చేసింది. ఇందులో ఎన్టీఆర్, రామ్‌చరణ్ బుల్లెట్‌పై వీధుల్లో సరదాగా షికార్లు కొడుతూ కనిపించారు. అయితే ఇది విడుదలైన కాసేపట్లోనే సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌గా మారింది. నెట్టిజన్లు, ఫ్యాన్స్ ఈ పోస్టర్‌ను ఫేస్ మార్ఫింగ్ చేశారు. తారక్, చెర్రీ స్థానంలో తమ అభిమాన హీరోలు, క్రికెటర్ల మొఖాలను ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నారు.
ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సైబరాబాద్ పోలీసులు ఈ కొత్త పోస్టర్‌ను వినూత్నంగా వినియోగించుకున్నారు. దీన్ని ఎడిట్ చేసి తారక్, చెర్రీకి హెల్మెట్ తగిలించారు. 'ఇప్పుడు పర్ఫెక్ట్. హెల్మెట్ ధరించండి. సురక్షితంగా ఉండండి' అంటూ వ్యాఖ్య జోడించారు.
దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో 'ఆర్ఆర్ఆర్' నిర్మిస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) తెరకెక్కిస్తుండగా ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్(Ramcharan), కొమురం భీమ్‌గా తారక్(NTR) నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మాత. కీరవాణి సంగీతమందిస్తున్నారు. ఆలియాభట్, ఒలీవియా మోరీస్, అజయ్ దేవ్‌గణ్, శ్రియ, తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'భీమ్ ఫర్ రామరాజు', 'రామరాజు ఫర్ భీమ్' టీజర్లు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.