ETV Bharat / sitara

RRR trailer: 'ఆర్​ఆర్​ఆర్​' ట్రైలర్​ రిలీజ్​కు డేట్​ ఫిక్స్​

author img

By

Published : Nov 29, 2021, 4:29 PM IST

RRR movie trailer: రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్​ఆర్​ఆర్'​ సినిమా ట్రైలర్​ డిసెంబరు 3న విడుదల చేయనున్నట్లు తెలిపింది చిత్రబృందం. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆర్​ఆర్​ఆర్​ ట్రైలర్​, RRR movie trailer
ఆర్​ఆర్​ఆర్​ ట్రైలర్​

RRR trailer update: ఎన్టీఆర్​, రామ్​చరణ్​ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమా 'ఆర్​ఆర్​ఆర్'(rrr movie updates today)​. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రచార కార్యక్రమాల వేగాన్ని పెంచారు. ఇందులో భాగంగా 'ఆర్ఆర్‌ఆర్‌' ట్రైలర్​ను డిసెంబరు 3న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

యాక్షన్‌, ఎమోషనల్‌ డ్రామాగా రూపొందిన 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో అల్లూరి సీతరామరాజుగా రామ్‌చరణ్‌, కొమురం భీమ్​గా తారక్‌ (ntr ram charan rrr movie) నటించారు. ఈ సినిమా విడుదల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య నిర్మించారు. కీరవాణి స్వరాలు అందించారు. ఆలియాభట్‌ (RRR heroine), ఒలీవియా మోరీస్‌ కథానాయికలు. శ్రియ, సముద్రఖని, అజయ్‌ దేవ్‌గణ్‌ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, గ్లింప్స్​, 'దోస్తీ', 'నాటు నాటు', 'జనని' పాటలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

ఇదీ చూడండి: Naatu Naatu song: తారక్‌- చెర్రీ ఎన్ని టేక్స్‌ తీసుకున్నారంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.