ETV Bharat / sitara

''ఆర్‌ఆర్‌ఆర్‌'ను ఇప్పటికే 12సార్లు చూశా.. ప్రతి ఫార్మాట్​లోనూ..'

RRR Movie: దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన 'ఆర్​ఆర్​ఆర్'​ను ఇప్పటికే 12 సార్లు చూసినట్లు తెలిపారు ప్రముఖ విజువల్ ఎఫెక్ట్స్​ సూపర్​వైజర్​ శ్రీనివాస్​ మోహన్. సాధారణ థియేటర్​, డాల్బీ విజన్, 3డీ, ఐమాక్స్​ సహా ప్రతి ఫార్మాట్​లోనూ సినిమా మరచిపోలేని అనుభూతిని ఇచ్చిందని వెల్లడించారు.

author img

By

Published : Mar 25, 2022, 7:36 AM IST

RRR movie
ఆర్‌ఆర్‌ఆర్‌

RRR Movie: ఎన్టీఆర్‌, రామ్‌చరణ్ కథానాయకులుగా తెరకెక్కిన 'ఆర్‌ఆర్‌ఆర్‌'ను ఇప్పటివరకూ 12సార్లు చూశానని ప్రముఖ విజువల్‌ ఎఫెక్ట్స్‌ సూపర్‌వైజర్‌ శ్రీనివాస్‌ మోహన్‌ అన్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బిగ్గెస్ట్‌ పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా శుక్రవారమే (మార్చి 25న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో 'ఆర్‌ఆర్‌ఆర్‌'కు విజువల్‌ ఎఫ్టెక్స్‌ కోసం పనిచేసిన శ్రీనివాస మోహన్‌ ఆసక్తికర ట్వీట్ చేశారు.

"'ఆర్‌ఆర్‌ఆర్‌' మళ్లీ చూస్తున్నా. ఇప్పటివరకూ ప్రతి ఫార్మాట్‌లో 12 సార్లు సినిమాను చూశా. ప్రతిసారీ నాలో ఉత్సుకత రెట్టింపు అవుతోంది. ప్రేక్షకులు స్పందన చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నా" అని ట్వీట్‌ చేశారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' మూవీ సాధారణ థియేటర్‌ ఫార్మాట్‌తో పాటు, డాల్బీ విజన్‌/డాల్బీ అట్మాస్‌, 3డీ, ఐమాక్స్‌ ఫార్మాట్‌లలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

డాల్బీ విజన్‌లో విడుదలవుతున్న తొలి భారతీయ చిత్రంగా 'ఆర్‌ఆర్‌ఆర్‌' రికార్డు సృష్టించింది. అంతేకాదు, 3డీ అంటే ఇష్టం లేకపోయినా కొన్ని సన్నివేశాలు ఆ ఫార్మాట్‌లో చూసిన తర్వాత దర్శకుడు రాజమౌళినే మంత్రముగ్ధుడై మొత్తం సినిమాను 3డీలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక శ్రీనివాసమోహన్‌ గతంలో '2.ఓ', 'బాహుబలి: ది బిగినింగ్‌', 'రోబో' చిత్రాలకు విజువల్‌ ఎఫెక్ట్స్‌ పర్యవేక్షకునిగా వ్యవహరించారు.

ఇదీ చూడండి: RRR Review: 'ఆర్​ఆర్​ఆర్'.. కుంభస్థలాన్ని బద్దలు కొట్టడం పక్కా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.