బాహుబలి సినిమా ఘన విజయం సాధించిన తర్వాత జక్కన్న మొదలుపెట్టిన చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్'. ఈ సినిమా ప్రారంభం నుంచే ఆటంకాల పరంపర కొనసాగుతోంది. మొదట రామ్‌చరణ్ గాయం కారణంగా తొలి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్టీఆర్‌కు గాయం రూపంలో మరో అడ్డంకి. ఇటీవల ఈ ఇద్దరు హీరోలు గాయాల నుంచి కోలుకొని తిరిగి సెట్స్‌లోకి అడుగుపెట్టారు. తాజాగా ఆలియా భట్ రూపంలో 'ఆర్‌ఆర్‌ఆర్' కు మరో అడ్డంకి ఎదురయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ చిత్రంలో చరణ్‌కు జోడీగా ఆలియా ఎంపికయిన విషయం తెలిసిందే.
పేగుకు ఇన్ఫెక్షన్...
ఆలియా హీరోయిన్గా తెరకెక్కుతోన్న మరో ప్రాజెక్టు 'బ్రహ్మాస్త్ర'. ఈ బాలీవుడ్ సినిమా చాలా భాగం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఇటీవల అలియా వారణాసిలో ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొంది. ఆ సమయంలో ఆమె పేగుకు ఇన్ఫెక్షన్ సోకిందట. వాస్తవానికి బ్రహ్మాస్త్ర సెట్స్‌లో అడుగుపెట్టడానికి ముందే ఆమెకు కొంత ఇన్ఫెక్షన్ సోకినప్పటికీ, చిత్రీకరణకు ఇబ్బంది కలుగకూడదనే ఉద్దేశంతో షూటింగ్‌లో పాల్గొనగా.. అక్కడున్న ఎండ వేడిమి కారణంగా ఇన్ఫెక్షన్ తీవ్రమయిందని తెలుస్తోంది. చికిత్స కోసం వెంటనే న్యూయార్క్‌కు వెళ్లిపోయిందట.
ఇప్పుడు ఈ సమస్యే ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ పైన కూడా ప్రభావం చూపించబోతుందట. త్వరలోనే ఆమె అహ్మదాబాద్‌లో జరగబోయే షెడ్యూల్‌లో జక్కన్న టీంతో కలవాల్సి ఉండగా.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆలియా వస్తుందా లేదా? అన్నది అనుమానంగా మారింది. ఒకవేళ ఈలోపు ఆమె ఆరోగ్యం కుదుట పడినా ముందుగా 'బ్రహ్మాస్త్ర' షూటింగ్‌లోనే పాల్గొనాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో జక్కన్న తన షెడ్యూల్‌లో ఏమైనా మార్పులు చేసుకుంటాడా? లేక మరేదైనా ప్రత్యామ్నాయాన్ని ఎంచుకుంటాడా? అన్నది చూడాల్సి ఉంది. ఏదేమైనా ఈ క్రేజీ మల్టీస్టారర్‌కు వరుసగా ఇలాంటి ఎదురుదెబ్బలు తగులుతుండటం వల్ల విడుదల తేదీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.