రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్' విడుదలకు సమయం దగ్గరపడుతోంది. సినిమా ఎప్పుడు విడుదలవుతుందా?.. ఎప్పుడు థియేటర్‌కు వెళ్లి ఈలలు వేసి గోల చేద్దామా! అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ఆఖరి షెడ్యూల్ షూటింగ్ ఉక్రెయిన్‌లో జరుగుతోంది. షూటింగ్‌కు మధ్యలో దొరికిన కాస్త విరామ సమయంలో చరణ్, తారక్‌ల మధ్య సంభాషణకు చెందిన ఓ ఫన్నీ వీడియోను చిత్రబృందం షేర్ చేసింది. ఈ వీడియోలో చెర్రీ.. చిత్రబృందంపై సరదాగా చిర్రుబర్రులాడుతున్నాడు. తారక్ అడిగిన ప్రశ్నకు డ్రమ్స్ ప్రాక్టీస్ చేశాను కానీ.. కాస్ట్యూమ్స్ ఇంకా సిద్ధం చేయలేదని, తనను వేచి ఉంచుతున్నారని అన్నాడు. ఈ ఫన్నీ వీడియో ప్రస్తుతం వైరల్ అయింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంలో ఆలియా భట్, ఒలివీయా మోరిస్ కథానాయికలు. శ్రియ, అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని, ఎలిసన్ డ్యూడీ, రేయ్ స్టీవ్‌సన్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. పోరాటయోధులు అల్లూరిసీతారామరాజు, కొమురంభీమ్ కలిస్తే.. వాళ్లిద్దరి మధ్య దోస్తీ ఎలా కుదిరింది? వాళ్ల దోస్తీ చివరికి ఎటువైపునకు దారి తీసింది? ఇలాంటి ఎన్నో ఆసక్తికర అంశాలతో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌సాంగ్ ప్రతి ఒక్కర్నీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. అక్టోబర్ 13న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదీ చదవండి:RRR movie: పిట్టగోడపై చెర్రీ- తారక్ సరదా ముచ్చట్లు