ETV Bharat / sitara

అక్కడ 1,000 మల్టీప్లెక్స్​ల్లో 'ఆర్‌ఆర్‌ఆర్‌' రిలీజ్​ - ఆర్​ఆర్ఆర్ న్యూస్​

RRR movie release : 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రం ప్రపంచవ్యాప్తంగా జనవరి 7న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ఇండియాలోనే కాకుండా ఓవర్సిస్​లో కూడా భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్ర బృందం. ఒక్క అమెరికాలోనే 1000 మల్టీప్లెక్స్​ల్లో సినిమాను రిలీజ్​ చేయాలని భావిస్తోందట​.

RRR movie updates
ఆర్​ఆర్​ఆర్ అప్​డేట్స్​
author img

By

Published : Dec 5, 2021, 9:41 PM IST

RRR movie release : సినీప్రియులంతా ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రం ప్రపంచవ్యాప్తంగా జనవరి 7న విడుదల కానుంది. కొమురం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్‌‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ కనిపించనున్న ఈ సినిమా విడుదల సన్నాహాలను దర్శకధీరుడు రాజమౌళి ఇప్పటికే ముమ్మరం చేశాడు. మూవీ ట్రైలర్​ను కూడా డిసెంబర్ 9న విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు. అయితే.. ఇండియాలో కాకుండా కేవలం ఓవర్సిస్​లో కూడా సినిమాను గ్రాండ్​గా రిలీజ్​ చేయాలని రాజమౌళి సహా చిత్ర బృందం భావిస్తోందట.

అమెరికాలోనే 1000 మల్టీప్లెక్స్​ల్లో సినిమా రిలీజ్​ చేయడమే లక్ష్యంగా చిత్ర యూనిట్​ పనిచేస్తున్నట్లు సమాచారం. బాహుబలి తర్వాత వస్తున్న సినిమా కావడంలో ఈ సినిమాపై భారీ అంచనాలు ఊన్నాయి.

సరిగమ సినిమా, రఫ్టర్​ క్రియేషన్స్ ఈ సినిమాను​ అమెరికాలో పంపిణీ చేస్తున్నాయి. సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య నిర్మించారు. కీరవాణి స్వరాలు అందించారు. ఆలియాభట్‌, ఒలీవియా మోరీస్‌ కథానాయికలు. శ్రియ, సముద్రఖని, అజయ్‌ దేవ్‌గణ్‌ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.

ఇదీ చదవండి:దేశం విడిచివెళ్లేందుకు నటి యత్నం.. అడ్డుకున్న అధికారులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.