దర్శకుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా 'ఆర్‌ఆర్‌ఆర్'. ఇందులో ప్రధాన పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్(రామరాజు ఫర్ భీమ్), రామ్‌చరణ్(భీమ్ ఫర్ రామరాజు)కు సంబంధించి ఫస్ట్‌లుక్, టీజర్ విడుదలై అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
తాజాగా 'రామరాజు ఫర్ భీమ్ టీజర్' ఓ రికార్డును సొంతం చేసుకుంది. యూట్యూబ్లో 50 మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకున్న తొలి టాలీవుడ్ టీజర్‌గా ఘనత సాధించింది. టాలీవుడ్లో 1 మిలియన్ లైక్స్ దక్కించుకున్న టీజర్‌గానూ ఇటీవల రికార్డును అందుకుంది.
"వాడు కనబడితే సముద్రాలు తడబడతాయి. నిలబడితే సామ్రాజ్యాలు సాగిలపడతాయి. వాడి పొగరు ఎగిరే జెండా.. వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండుటెండ.. వాడు భూతల్లి చనుబాలు తాగిన మన్యం ముద్దు బిడ్డ. నా తమ్ముడు.. గోండ్రు బెబ్బులి.. కొమురం భీమ్" అంటూ తారక్ పాత్రను రామ్‌చరణ్ పరిచయం చేసిన డైలాగ్ అభిమానులు చేత ఈలలు వేయించింది.
ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ సరసన ఒలివియా మోరిస్, అలియా భట్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్‌దేవగణ్, శ్రియ కీలక పాత్రలో కనిపించనున్నారు. అక్టోబర్ 13న విడుదల కానుందీ సినిమా.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: 'ఆర్‌ఆర్‌ఆర్' ఉగాది సర్ప్రైజ్ వచ్చేసింది!