ETV Bharat / sitara

'బాహుబలి-2' రికార్డ్ బ్రేక్.. ప్రీమియర్స్​లో 'ఆర్​ఆర్​ఆర్' కలెక్షన్ల సునామీ - ఆలియా భట్

RRR Beats Baahubali 2 Record: విడుదలకు ముందే రికార్డులను బ్రేక్​ చేయడం సహా కొత్త బెంచ్​మార్క్​ను సృష్టిస్తోంది 'ఆర్​ఆర్​ఆర్​'. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం.. అమెరికా ప్రీమియర్​ ప్రీ సేల్స్​లో ఇప్పటికే 2.5 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. దీంతో 'బాహుబలి-2' రికార్డ్ బ్రేక్ అయ్యింది.

RRR Movie
RRR Beats Baahubali 2 Record
author img

By

Published : Mar 24, 2022, 7:49 AM IST

Updated : Mar 24, 2022, 8:00 AM IST

RRR Beats Baahubali 2 Record: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్​ఆర్ఆర్'.. రిలీజ్​కు ముందే​ భారతీయ చిత్రాల రికార్డ్​లను తిరగరాస్తోంది. అమెరికా ప్రీమియర్​ ప్రీ సేల్స్​లో ఈ చిత్రం ఇప్పటికే 2.5 మిలియన్​ డాలర్ల మార్కును దాటేసింది. దీంతో 'బాహుబలి-2' రికార్డ్ బ్రేక్ అయ్యింది. ప్రీమియర్స్​లో 2.4 మిలియన్​ డాలర్లను వసూలు చేసింది 'బాహుబలి-2'.

RRR Movie
'ఆర్​ఆర్​ఆర్'​

అయితే 2.5మి. డాలర్లతో ఆగిపోలేదు 'ఆర్​ఆర్​ఆర్'​. క్రమంగా 3మిలియన్​ డాలర్ల వైపు పయనిస్తోంది. దీంతో మునుపెన్నడూ చూడని బెంచ్​మార్క్​ను సెట్​ చేయబోతోంది. ఎన్టీఆర్​, రామ్​చరణ్​ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. అమెరికాలో నేడే (మార్చి 24) 'ఆర్​ఆర్​ఆర్​' ప్రీమియర్​ షోలు వేయనున్నారు.

RRR Movie
'ఆర్​ఆర్​ఆర్'​

కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించారు. దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్‌తో 'ఆర్​ఆర్​ఆర్​'ను తీర్చిదిద్దారు. తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని థియేటర్‌లు ఈ వీకెండ్‌ 'ఆర్‌ఆర్‌ఆర్‌' రీసౌండ్‌తో దద్దరిల్లనున్నాయి.

ఇదీ చూడండి: చరణ్​ ఆ డైలాగ్​ కోసం 80 టేక్​లు తీసుకున్నాడు: రాజమౌళి

Last Updated : Mar 24, 2022, 8:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.