డీసీ కామిక్స్ నుంచి వచ్చి ఎంతో ప్రాచుర్యం పొందిన 'బ్యాట్మన్'కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. తాజాగా ఈ ఫ్రాంచైజీ నుంచి కొత్త సినిమా రాబోతుంది. 'ద బ్యాట్మన్' టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రాబర్ట్ ప్యాటిన్సన్ తొలిసారి బ్యాట్‌మన్‌గా కనిపించనున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు చిత్ర దర్శకుడు మ్యాట్ రీవ్స్.
తొలిసారిగా చేస్తున్నా.. ప్యాటిన్సన్ బ్యాట్‌మన్‌గా ఆకట్టుకున్నాడు. ఇంతకుముందు బెన్ అఫ్లెక్, క్రిస్టియన్ బేల్, జార్జ్ క్లూనీ, మైఖెల్ కీటోన్ ఈ పాత్రలు పోషించి మెప్పించారు. దీంతో ప్యాటిన్సన్ బ్యాట్‌మన్‌గా ఎలా నటిస్తాడా అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్‌లో తిరిగి షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈచిత్రం 2021 అక్టోబర్‌లో విడుదల కానుంది.
-
Watch #TheBatman DC FanDome Teaser Trailer Now https://t.co/hOAsEVxTYg
— Matt Reeves (@mattreevesLA) August 23, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Watch #TheBatman DC FanDome Teaser Trailer Now https://t.co/hOAsEVxTYg
— Matt Reeves (@mattreevesLA) August 23, 2020Watch #TheBatman DC FanDome Teaser Trailer Now https://t.co/hOAsEVxTYg
— Matt Reeves (@mattreevesLA) August 23, 2020