ETV Bharat / sitara

'సుశాంత్​పై దొంగ ప్రేమ చూపిస్తున్నావా రియా?' - నటిరియా చక్రవర్తిపై నెటిజన్లు ఫైర్​

దివంగత హీరో సుశాంత్​ను తాను అమితంగా ప్రేమిస్తున్నట్లు ట్వీట్​ చేసిన అతడి ప్రియురాలు నటి రియా చక్రవర్తికి నెటిజన్ల నుంచి సెగ తగిలింది. దొంగ ప్రేమ చూపిస్తుందంటూ ఆమెపై కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.

riya
రియా
author img

By

Published : Jul 15, 2020, 11:58 AM IST

బాలీవుడ్​ నటుడు సుశాంత్​ మరణించిన నెలరోజుల తర్వాత స్పందించిన నటి, ప్రేయసి రియా చక్రవర్తిపై నెటిజన్లు ఫైర్​ అవుతున్నారు. జులై 14న అతడిని ఉద్దేశిస్తూ ఓ భావోద్వేగ సందేశాన్ని పోస్ట్​ చేసిందీ భామ. అతడిపై అనంతమైన ప్రేమ ఉందని, ప్రస్తుతం ఎంతగానో మిస్​ అవుతున్నట్లు వెల్లడించింది.

అయితే ఈ పోస్ట్​పై స్పందించిన నెటిజన్లు ఆమెపై తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. సుశాంత్​ బ్రతికి ఉన్నప్పుడు పట్టించుకోలేని రియా.. ప్రస్తుతం దొంగ ప్రేమ చూపిస్తోందని కామెంట్లు పెడుతున్నారు.

sushanthj
సుశాంత్​

"నీ ప్రియుడు మరణించిన నెలరోజులకు అకస్మాత్తుగా గుర్తొచ్చాడా? అతడి​ మరణానికి దర్శకుడు మహేష్​భట్​ కారణమని నీకు తెలియదా? వింతగా ఉందే. అతడిని చంపిన ఈ హంతకులకు ఏ శిక్ష వేసినా సరిపోదు." అని ఓ నెటిజన్​ కామెంట్​ పెట్టాడు.

"సుశాంత్​ బ్రతికి ఉన్నప్పుడు పక్కన పెట్టింది. ఇప్పుడేమో అమితమైన ప్రేమ ఉన్నట్లు నటిస్తోంది.!"

"ఈ హంతకులు ఇంతా బ్రతికి ఉండటం చూసి అతడి ఆత్మకు ఎలా శాంతి చేకూరుతుంది"

" డ్రామా క్వీన్​.. భలే చక్కనైనా భావోద్వేగపూరితమైన సందేశాలను పెట్టావు. వీటిని చూస్తుంటే నవ్వొస్తోంది."

"మహేశ్​ భట్​ నవ్వు కలిసి చంపేశారు.." అని పలువురు నెటిజన్లు కామెంట్లు పెట్టారు.

జూన్​ 14న తన ఇంటిలో ఉరివేసుకొని బలన్మరణానికి పాల్పడ్డారు ఈ యువ హీరో సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​.

riya
రియా

ఇది చూడండి : 'సుశాంత్​ చెప్పలేనంత వేదన మిగిల్చాడు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.