ETV Bharat / sitara

రియానే సుశాంత్​కు విషమిచ్చి చంపేసింది: కేకే సింగ్

author img

By

Published : Aug 27, 2020, 9:55 AM IST

బాలీవుడ్ నటుడు సుశాంత్​ ఆత్మహత్యకు కారణం రియా చక్రవర్తే అంటూ అతడి తండ్రి కేకే సింగ్ మరోసారి ఆరోపించారు. రియా తన తనయుడికి విష ప్రయోగం చేసిందని అన్నారు.

రియానే సుశాంత్​కు విషమిచ్చి చంపేసింది: కేకే సింగ్
రియానే సుశాంత్​కు విషమిచ్చి చంపేసింది: కేకే సింగ్

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్​పుత్ ఆత్మహత్య కేసు విచారణను కొనసాగిస్తోంది సీబీఐ. బంధువులు, స్నేహితులను విచారించే పనిలో పడింది. అయితే ఇప్పటికే తన కుమారుడు సుశాంత్ మరణానికి కారణం రియా చక్రవర్తే అంటూ చెప్పుకొస్తున్న కేకే సింగ్ మరోసారి ఆమెపై ఆరోపణలు చేశారు.

"సుశాంత్​కు రియా చాలాకాలంగా విషం ఇస్తూ వస్తోంది. ఆమెనే నా కొడుకును చంపింది. సీబీఐ వెంటనే ఆమెతో పాటు ఇందుకు సహకరించిన వారిని అరెస్ట్ చేయాలి."

-కేకే సింగ్, సుశాంత్ తండ్రి

మాదకద్రవ్యాల కోణంలోనూ విచారణ

డ్రగ్స్​ కోణంలో విచారణ చేయడానికి ఈడీ.. నార్కోటిక్స్​ కంట్రోల్​ బ్యూరో (ఎన్​సీబీ) సహాయాన్ని కోరింది. ఈడీ వర్గాల సమాచారం ప్రకారం రియాకు సంబంధించిన వాట్సాప్​ చాటింగ్​, మాదకద్రవ్యాలు గురించి కొన్ని రోజులుగా చర్చ నడుస్తోంది. ప్రస్తుతం మనీలాండరింగ్​ అంశంపై దర్యాప్తు చేస్తున్న ఈడీ.. నటి రియాకు సంబంధించిన ఫోన్లు, ఎలక్ట్రానిక్​ పరికరాలను స్వాధీనం చేసుకుంది. వాటిని పరిశీలించిన తర్వాత డ్రగ్స్​ కోణంలో విచారణ జరుగుతుందని.. దీనికి సంబంధించిన ఆధారాలను సీబీఐ, ఎన్​సీబీలతో పంచుకున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.