బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రియురాలు రియా చక్రవర్తి సోమవారం సుప్రీం కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసింది. మీడియా తనపై అన్యాయంగా నిందలు మోపుతోందని.. సుశాంత్ మృతి విషయంలో తనను దోషిగా చూపిస్తున్నారని ఆరోపించింది.
రియా తాజా అభ్యర్థనలోని ముఖ్యాంశాలు ఇవే..
- దేశవ్యాప్తంగా ఈ కేసు సంచలనాత్మకంగా మారిన కారణంగా పిటిషనర్ హక్కులకు భంగం వాటిల్లడంతో పాటు, గోప్యత ఉల్లంఘన జరిగే అవకాశం ఉంది.
- నటులు అశుతోష్ భక్రే, సమీర్ శర్మ కూడా గడిచిన 30 రోజుల్లో ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఆ విషయంపై ఎవరూ స్పందించడం లేదు.
- సుశాంత్ కేసు చర్చనీయాంశం కాకముందే.. పిటిషనర్‌పై మీడియా నిందలు మోపింది.
- ముంబయి మెజిస్ట్రేట్‌కు బదులుగా పట్నాకు కేసును బదిలీ చేయడంలో బిహార్ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా వ్యవహరించింది. రాష్ట్రం, కేంద్రంలో ఒకే అధికార పార్టీ ఉండటమే ఇందుకు కారణం.
- సీబీఐకి కేసును అప్పగించడానికి కొన్ని పద్దతులున్నాయి.
- ఈడీ సరైన న్యాయం కోసం తగిన రీతిలో విచారణ చేపడుతోంది.
రెండో రోజూ రియా తన కుటుంబ సభ్యులతో కలిసి విచారణ నిమిత్తం ఈడీ కార్యాలయానికి వచ్చింది. అంతకుముందు శుక్రవారం సుమారు 8 గంటల పాటు మనీల్యాండరింగ్ కేసులో రియాను అధికారులు ప్రశ్నించారు. ఆమె సోదరుడు షోయిక్నూ శనివారం 18 గంటలు విచారించారు.