ETV Bharat / sitara

రియా చక్రవర్తి బెయిల్​పై తీర్పు వాయిదా - rhea chakraborthy bail postpone tomorrow

బాలీవుడ్​ నటి రియా చక్రవర్తి బెయిల్​ మంజూరు విషయమై ముంబయి కోర్టు తీర్పును రేపటికి వాయిదా వేసింది. దీంతో రియా ఈరోజు కూడా బైకుల్లా జైలులోనే ఉండనుంది.

Rhea Chakraborty
రియా చక్రవర్తి
author img

By

Published : Sep 10, 2020, 6:48 PM IST

Updated : Sep 10, 2020, 7:06 PM IST

బాలీవుడ్‌ నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్‌ చక్రవర్తి బెయిల్‌ పిటిషన్‌పై ముంబయి ప్రత్యేక కోర్టులో వాదనలు ముగిశాయి. వీరిద్దరికీ బెయిల్‌ మంజూరుపై నిర్ణయాన్ని కోర్టు రేపటికి వాయిదా వేసింది. దీంతో రియా ఈరోజు కూడా బైకుల్లా జైలులోనే ఉండనుంది.

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ అనుమానాస్పద మృతి కేసులో రియా ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ కేసులో ఆమెను సీబీఐ విచారించగా.. డ్రగ్స్‌ కోణం బయటపడింది. దీంతో నార్కొటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) రంగంలోకి దిగింది. రియాను మూడు రోజుల పాటు విచారించిన అధికారులు మంగళవారం ఆమెను అరెస్టు చేశారు. అనంతరం ఆమెను కోర్టులో హాజరు పరచగా.. ఈనెల 23వరకు జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది. తాజాగా, ఆమె ముంబయి సెషన్స్‌ కోర్టులో బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోగా ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. ఈ కేసులో అరెస్టయిన నిందితులందరి బెయిల్‌పైనా శుక్రవారం నిర్ణయం వెలువరించనుంది.

న్యాయస్థానంలో రియా తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ .. ఆమె నివాసంలో ఎన్‌సీబీ అధికారులు జరిపిన సోదాల్లో ఎలాంటి డ్రగ్స్‌ లభ్యం కాలేదని తెలిపారు. అధికారులు దర్యాప్తునకు కూడా ఆమె బాగా సహకరిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సుశాంత్‌ మాదకద్రవ్యాలకు బానిస కావడం వల్లే అతడికి డ్రగ్స్‌ సరఫరా చేసేదని వాదించినట్లు తెలుస్తోంది. దీనికి ఎన్‌సీబీ అధికారులు స్పందిస్తూ.. రియాను ఇంకా కస్టడీలో ఉంచడమే మంచిదని అభిప్రాయపడినట్టు సమాచారం.

ఇదీ చూడండి కంగనా రనౌత్​పై పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు

Last Updated : Sep 10, 2020, 7:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.