మాస్ మహారాజా రవితేజతో యువనటి అప్సరా రాణి ఆడిపాడుతోంది. 'క్రాక్' సినిమాలోని ప్రత్యేక గీతంలో సందడి చేయనుంది. ప్రస్తుతం ఈ పాట చిత్రీకరణ జరుగుతోంది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా దర్శకుడు గోపీచంద్ మలినేని వెల్లడించారు.
వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పోలీసు అధికారి వీరశంకర్‌గా రవితేజ కనిపించనున్నారు. శ్రుతి హాసన్ హీరోయిన్. తమన్ సంగీతమందిస్తున్నారు. ఠాగూర్ మధు నిర్మాత. వచ్చే ఏడాది ప్రారంభంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.