ETV Bharat / sitara

'కరోనా వైరస్​' కథాంశం ఇదే: ఆర్జీవీ - corona movie

కరోనా ఇతివృత్తంతో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిన చిత్రం 'కరోనా వైరస్‌'. తాజాగా ఈటీవీ భారత్​తో ముచ్చటించిన ఆయన.. ఈ చిత్ర విశేషాలు సహ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. లాక్​డౌన్​లో మానవ సంబంధాలు ఎలా దెబ్బతిన్నాయనే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలిపారు.

rgv
కరోనా చిత్రం
author img

By

Published : Dec 7, 2020, 6:48 AM IST

రాంగోపాల్​ వర్మ ఇంటర్వ్యూ

లాక్ డౌన్​లో మానవ సంబంధాలు ఎలా దెబ్బతిన్నాయనే కథాంశంతో 'కరోనా వైరస్​' చిత్రాన్ని తెరకెక్కించినట్లు స్పష్టం చేశారు వివాదాస్పద చిత్రాల దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఆ సమయంలో ఓ కుటుంబంలో జరిగిన అనూహ్య సంఘటనలే ఈ చిత్ర ఇతివృత్తం అన్నారు. కరోనాకు ఏ మాత్రం బెదరకుండా తమ చిత్ర బృందమంతా పనిచేసిందని పేర్కొన్న వర్మ... ఈ వైరస్​ ప్రపంచానికి పెద్ద గుణపాఠం నేర్పిందన్నారు.

అగస్త్యమంజు దర్శకత్వంలో ఈ నెల 11న తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. త్వరలోనే రాజకీయ నేపథ్యంగా ప్రజలపై వ్యంగ్యాస్త్రంగా మరో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి : ఆర్జీవీ బయోపిక్ :​ తొలి ప్రేమ నుంచి వివాదాల వరకు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.