ETV Bharat / sitara

ఈటీవీ భారత్ కథనానికి స్పందన... పేదింటి బిడ్డకు సోనూసూద్ ఆపన్నహస్తం - Sonusood helps poor child for operation

సినీనటుడు సోనూసూద్ తన సహృదయాన్ని మారోసారి చాటుకున్నాడు. ఓ పేదింటి బిడ్డకు సాయం చేసేందుకు ముందుకొచ్చాడు. వైద్యానికి అయ్యే ఖర్చంతా తానే భరిస్తానని హామీ ఇచ్చాడు.

పేదింటి బిడ్డకు సోనుసూద్ ఆపన్నహస్తం
పేదింటి బిడ్డకు సోనుసూద్ ఆపన్నహస్తం
author img

By

Published : Oct 2, 2020, 7:42 AM IST

పేదింటి బిడ్డకు పెద్ద జబ్బు ఆదుకోండి ప్లీజ్ అని ఈటీవీ భారత్​లో సెప్టెంబర్ 26న ప్రచురితమైన కథనానికి సినీనటుడు సోనూసూద్ స్పందించారు. వైద్యానికి అయ్యే ఖర్చంతా తాను అందిస్తానని భరోసాను ఇచ్చినట్లు బాధితుని తండ్రి తెలిపారు.

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం పెరుమాండ్ల సంకీస గ్రామానికి చెందిన దేశ బోయిన నాగరాజు, శ్రీ లక్ష్మి దంపతులకు ఇద్దరు పిల్లలు... కుమార్తె, కుమారుడు. కొడుకు హర్షవర్ధన్​ ఆరునెలల వయసు నుంచే అనారోగ్యానికి గురయ్యాడు. స్థానికంగా తగ్గకపోవడం వల్ల హైదరాబాద్ లోని ఓ పెద్ద ఆసుపత్రిలో చూపించారు.

రూ. 20 లక్షల వరకు..

అక్కడ అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు లివర్ మార్చాలని, రూ. 20 లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. నాగరాజు మహబూబాబాద్ ఆర్టీసీ డ్రైవర్​గా పని చేస్తున్నాడు. అంత పెద్ద మొత్తంలో వెచ్చించే పరిస్థితి లేకపోవడం వల్ల ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో సోనూసూద్ దేవుడిలా కనిపించి ఆపన్న హస్తం అందించారు.

ఇదీ చూడండి: రైతన్నను కాపాడుకునే విషయంలో దేవునితోనైనా కొట్లాటకు సిద్ధం: సీఎం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.