దేవకట్టా దర్శకత్వంలో యువ కథానాయకుడు సాయితేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'రిపబ్లిక్'. మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను నేడు (సోమవారం) దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు. రాజకీయాలు, ప్రభుత్వం, పాలనా విభాగం వంటి అంశాలతో ముడిపడి ఉన్న ఈ సినిమా టీజర్ ఆకట్టుకుంటోంది.
"వ్యవస్థ పునాదులే కరప్ట్ అయినపుడు అందరూ కరప్టే సార్", "సివిల్ సర్వెంట్స్ అండ్ కోర్టులు కూడా ఆ రూలర్స్ కింద బానిసల్లాగే బతుకున్నారు" వంటి డైలాగ్స్ అలరిస్తున్నాయి.
ఈ చిత్రంలో ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్గా నటిస్తుండగా జగపతి బాబు, రమ్యకృష్ణ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 4న విడుదల కానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">