బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం.. ప్రతి చిత్ర పరిశ్రమలోనూ ఉన్నాయని నటి రేణు దేశాయ్ పేర్కొన్నారు. ఆమె తాజా ఇంటర్వ్యూలో కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య గురించి మాట్లాడారు. ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా పరిశ్రమకు వచ్చినప్పుడు నైపుణ్యంతోపాటు దృఢత్వమూ ఉండాలని పేర్కొన్నారు.
"సుశాంత్ చాలా తెలివైన వాడు.. కానీ, సున్నితమైన వ్యక్తిత్వం. అతడు విజయాలు అందుకున్నాడు, స్టార్‌గా ఎదిగాడు. అందరూ బంధుప్రీతి వల్లే మానసిక ఒత్తిడికి గురయ్యాడని అంటున్నారు. ప్రతి చిత్ర పరిశ్రమలోనూ బంధుప్రీతి ఉంది, అది మనందరికీ తెలుసు. సినీ కుటుంబం కానప్పుడు.. కేవలం నైపుణ్యం ఉంటే సరిపోదు. దాంతోపాటు బలంగా ఉండటం నేర్చుకోవాలి. 'నన్ను నేను నిరూపించుకోవాలి' అనే సంకల్పం ఏర్పరచుకోవాలి. మన ఇష్టం ప్రకారం కెరీర్ జరగదు.. దానికి దిగులుపడకూడదు. జీవితం ఎప్పుడూ మనం అనుకున్నట్లు ఉండదు."
- రేణు దేశాయ్, కథానాయిక
రేణు నటిగా, దర్శకురాలిగా, కాస్ట్యూమ్ డిజైనర్‌గా గుర్తింపు పొందారు. టాలీవుడ్‌లో ఆసక్తికరమైన పాత్రలో నటించే అవకాశం వస్తే చేస్తానని ఇటీవల అన్నారు. ప్రస్తుతం ఆమె రైతుల జీవితాలు, వారి సమస్యలపై సినిమా తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి 'అన్నదాత సుఖీభవ' అనే టైటిల్‌నూ ఖరారు చేశారు. ఈ ప్రాజెక్టు కోసం కొన్నిరోజుల క్రితం రేణు పల్లెటూళ్లకు వెళ్లి.. అక్కడి పరిస్థితుల్ని గమనించారు.