ETV Bharat / sitara

సల్మాన్ 'రాధే' దెబ్బకు క్రాష్​ అయిన సర్వర్లు - Radhe OTT

పే పర్ వ్యూ విధానంలో ఓటీటీలో ప్రేక్షకుల ముందుకొచ్చిన 'రాధే' సినిమాకు స్వల్ప ఇబ్బందులు ఎదురయ్యాయట. ఎక్కువమంది వినియోగదారులు లాగిన్​ కావడం వల్ల ఓటీటీ సర్వర్లు డౌన్ అయినట్లు తెలుస్తోంది.

Salman Khan's Radhe makes ZEE5 servers crash
సల్మాన్ దిశా పటానీ
author img

By

Published : May 13, 2021, 6:57 PM IST

Updated : May 13, 2021, 7:11 PM IST

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ నటించిన సినిమా 'రాధే'. థియేటర్లతో పాటు ఓటీటీల్లోనూ గురువారం విడుదలైంది. అయితే వినియోగదారులు సినిమా కోసం ఒక్కసారిగా లాగిన్‌ కావడం వల్ల ఓటీటీ వేదిక 'జీ5', 'జీఫ్లెక్స్‌' సర్వర్లు స్తంభించిపోయాయి. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సల్మాన్‌ఖాన్‌ సరసన దిశాపటానీ నటించింది.

Salman Khan's Radhe
రాధే సినిమాలో సల్మాన్

అయితే ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ను చూసేందుకు ఈ రోజు(మే 13) మధ్యాహ్నం 12గంటలకు ఒక్కసారిగా పెద్దసంఖ్యలో సినీ ప్రియులు ఓటీటీలోకి లాగిన్‌ అయ్యారట. దీంతో సర్వర్లు ఒక్కసారిగా స్తంభించిపోయాయి. అయితే.. సర్వర్లు ఆగిపోవడానికి గల కారణాలు సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించలేదు. ‘మీ ప్రేమకు ధన్యవాదాలు. సమస్యను పరిష్కరిస్తున్నాం. త్వరలోనే మీ ముందుకు వస్తాం’ అని ట్విటర్‌లో పేర్కొంది.

కొంతమంది వినియోగదారులు ఎలాంటి అంతరాయం లేకుండానే సినిమాను వీక్షించారు. కొంతమంది మాత్రం ఇప్పటికీ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో రణ్‌దీప్‌ హుడా, మేఘా ఆకాశ్‌, జాకీ ష్రాఫ్‌ కీలక పాత్రలు పోషించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Last Updated : May 13, 2021, 7:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.