టాలీవుడ్లో ఓ భారీ బడ్జెట్ చిత్రంగా రామాయణాన్ని తెరకెక్కించేందుకు ప్రణాళిక రెడీ చేస్తున్నారు ప్రముఖ తెలుగు నిర్మాతలు అల్లు అరవింద్, మధు మంతెన. ఇప్పటికే ఈ చిత్రంలో రాముడిగా బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, సీతగా దీపికా పదుకొణెలను తీసుకొన్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఇందులో హృతిక్‌ను ఎదుర్కొనే రావణుడి పాత్రను ఎవరు చేస్తారనేదానిపై ఆసక్తి ఏర్పడింది.
తాజాగా ఈ పాత్ర కోసం బాహుబలి ప్రభాస్‌ను తీసుకోవాలని చిత్ర నిర్మాతలు ఆలోచిస్తున్నారట. అయితే ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాలని అనుకుంటున్న ఈ సినిమాకు నిర్మాణ బాధ్యతలు చేపట్టేందుకు... బాలీవుడ్ ప్రముఖ నిర్మాత నమిత మల్హోత్రా కూడా ఓకే చెప్పారట.
ప్రభాస్ ఇప్పుడు దేశమంతటా క్రేజ్ ఉన్న పెద్ద కథానాయకుడు. అందుకే రెబల్‌స్టార్‌ను రావణ పాత్రకు ఎంచుకోవడం ఓ కారణం కావచ్చు. ఇలాంటి పెద్ద చిత్రాలు తీసేటప్పుడు నటీనటులు అందరికీ తెలిసినవాళ్లయితే సినిమాకు మరింత లాభమని చిత్రవర్గాలు అంటున్నాయి.
ఇదీ చదవండి...