హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలంటే గుర్తొచ్చే పేరు కంగనా రనౌత్. ఈ ఏడాది ‘మణికర్ణిక’గా బాక్సాఫీస్‌ను షేక్ చేసిందీ లేడీ స్టార్. ఇటీవలే 'ధాకడ్' టీజర్‌తో అలరించింది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా 'తలైవి'చిత్రం త్వరలో పట్టాలెక్కనుంది. ఇందులో జయలలిత పాత్ర పోషించేందుకు సిద్ధమవుతోంది కంగనా. అక్టోబరు తొలి వారం నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.
ఈ చిత్రానికి ఏ.ఎల్.విజయ్ దర్శకత్వం వహించనున్నాడు. ఇప్పటికే ప్రీప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయి.
మరోవైపు 'అమ్మ' పాత్ర కోసం తమిళం నేర్చుకుంటూ క్లాసికల్ డ్యాన్స్‌లోనూ శిక్షణ పొందుతోంది కంగనా. తొలి షెడ్యూల్‌ను మైసూర్లో మొదలుపెట్టనున్నారు. ఈ బయోపిక్కు ప్రముఖ రచయితలు విజయేంద్రప్రసాద్, రాహుల్ అరోరా కథను అందించారు.
ఇది చదవండి: ధాకడ్ టీజర్: 'రక్తం రుచి మరిగిన కిల్లర్‌లా మారిన క్వీన్'