కరోనా తీవ్రత వల్ల భారత్లో లాక్డౌన్ అమల్లో ఉంది. ఈ కారణంగా సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. తమకిష్టమైన పనులు చేస్తూ బిజీగా గడిపేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటి పరిణితి చోప్రా అదిరిపోయే ఫొటోలను పోస్ట్ చేసింది. ఓ వెడ్డింగ్ మ్యాగజైన్ కోసం పెళ్లికూతురు వేషధారణలో కనిపించి, అభిమానులను ఆశ్చర్యపరిచింది. "పెళ్లికి సిద్ధంగా ఉన్నాను. వరుడు కావలెను" అంటూ ఓ వ్యాఖ్య జోడించింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఈ ఫోటోలపై ప్రియాంక చోప్రా సహా మిగతా సెలబ్రిటీలు అందరూ కామెంట్లు చేస్తున్నారు. త్వరలో 'సందీప్ ఔర్ పింకీ ఫరార్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుందీ పరిణితి.
ఇదీ చూడండి : సీతాపహరణం చూస్తూ 'రావణాసురుడు' భావోద్వేగం