ETV Bharat / sitara

రవితేజ చూపించిన 'కిక్​'కు 12 ఏళ్లు! - రవితేజ, సురేందర్ రెడ్డి

మాస్​మహారాజా రవితేజ 'కిక్'​ సినిమాకు నేటితో 12 ఏళ్లు పూర్తయింది. ప్రేక్షకులకు ఇప్పటికీ ఈ చిత్రాన్ని అభిమానిస్తున్నారంటే, ఎంతలా అలరించిందో అర్థం చేసుకోవచ్చు.

Raviteja Kick completes 12 years
రవితేజ చూపించిన కిక్​కు 12 ఏళ్లు!
author img

By

Published : May 8, 2021, 12:00 PM IST

మాస్ మహారాజా రవితేజ ఎనర్జీ, ఇలియానా అందం, తమన్ సంగీతం​, అలీ, బ్రహ్మానందంల హాస్య సన్నివేశాలు, అప్పుడప్పుడు యాక్షన్.. ఇలా ఒకటేంటి ప్రతి సీన్​లోనూ ప్రేక్షకులకు 'కిక్'​ను అందించే సినిమా 'కిక్'. సురేందర్​రెడ్డి దర్శకత్వం వహించారు. "ఎవరి డ్రీమ్ వాళ్లు తీర్చుకుంటే కిక్ ఏముంది.. పక్కనోళ్ల డ్రీమ్​ తీరిస్తేనే కదా కిక్కు".. అనే నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్​బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. విడుదలై నేటికి 12 ఏళ్లు పూర్తయినా టాలీవుడ్ ప్రేక్షకులు ఇప్పటికీ ఈ సినిమాను మర్చిపోలేకపోతున్నారంటే ఈ చిత్రం ఎంత కిక్ ఇచ్చిందో అర్థం చేసుకోవచ్చు.​

పాప నవ్వుతో

కథానాయకుడు బాగా చదువుకున్న వ్యక్తి. అయితే అతనికి ఉద్యోగం చేయడం నచ్చదు. ప్రతిరోజూ కొత్తదనం కావాలి. చేసే ప్రతి పనిలోనూ 'కిక్' ఉండాలి. అతనికి అసలైన కిక్‌ ఓ పాప చిరునవ్వులో దొరుకుతుంది. అలాంటి నవ్వు.. వందల, వేల చిన్నారుల ముఖాల్లో కురిపించేందుకు దొంగగా మారాలి. ఇలాంటి కథతో సినిమా మొదలు పెట్టినప్పుడు దర్శకుడు సురేందర్‌ రెడ్డి, రవితేజ ఊహించారో ,లేదో? ఇది వాళ్లిద్దరి కెరీర్‌కు మరిచిపోలేని 'కిక్‌' ఇస్తుందని.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అంతా 'కిక్కే'

ఈ సినిమాలో ప్రతీ అంశం ప్రేక్షకులకు 'కిక్'​ను అందిస్తుంది. రవితేజ బాడీ లాంగ్వేజ్‌ను, ఈ కథను వేరుగా చూడలేం. కల్యాణ్‌ పాత్రలో తనదైన ఎనర్జీతో సినిమా మొత్తాన్ని హుషారెత్తించాడు. నైనాగా ఇలియానా అందం, అభినయంతో కుర్రకారు మతులు పోగొట్టింది. పోలీసు అధికారి కల్యాణ్‌ కృష్ణ పాత్రలో శ్యామ్ నటన అందరి దృష్టిని ఆకర్షించింది. షాయాజీ షిండే, బ్రహ్మానందం, వేణు మాధవ్‌, బెనర్జీ, కోట శ్రీనివాసరావు, అలీ, జయప్రకాశ్‌ రెడ్డి తదితరులు తమ పాత్రల్లో ఒదిగిపోయారు.ఈ సినిమాకు మరో ప్రధాన బలం మ్యూజిక్. ఈ చిత్రంతోనే మణిశర్మ శిష్యుడు ఎస్‌.ఎస్‌.తమన్‌ సంగీత దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. తొలి సినిమాకే మంచి స్వరాలు అందించి గురువుకు తగ్గ శిష్యుడనిపించుకున్నాడు. నేపథ్య సంగీతంలోనూ తనదైన ముద్ర వేశాడు‌. 'ఐ డోంట్‌ వాంట్ లవ్‌', 'గోరే గొగ్గొరే', 'బాసూ మనకు మెమొరీ లాసు' గీతాలు విశేషణ ఆదరణ పొందాయి.

వాడి కిక్​ ఆగదు

ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందించగా అబ్బూరి రవి మాటలు రాశారు. 'పాప నవ్వుతో మొదలైంది వాడి కిక్‌.. ఆగదు' అని ఓ సందర్భంలో షాయాజీ షిండే చెప్పినట్లు రవితేజ అందించిన 'కిక్‌' ఎన్నడూ ఆగలేదు. అనంతరం కొన్నాళ్లకు కిక్​ సీక్వెల్​ 'కిక్‌ 2' వచ్చినా ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.